పవన్ కోసం రక్తం చిందించిన ఫ్యాన్: ఏకంగా ‘వకీల్ సాబ్’ దగ్గరకెళ్లి అలా.. ఒళ్లు గగుర్పొడిచేలా చేశాడు

సాధారణంగా సినీ స్టార్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అందులో కొంత మందికి మాత్రమే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లే తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే పండుగలా జరుపుకుంటారు. హిట్ వస్తే పొంగిపోతారు.. ఫ్లాప్ అయితే కృంగిపోతారు. మొత్తానికి ఫేవరెట్ హీరోకు అండగా ఉంటారు. టాలీవుడ్‌లో ఇలాంటి అభిమానులు ఉన్న హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన నటించిన 'వకీల్ సాబ్' నిన్న విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. అందులో ఓ అభిమాని ఊహించని పని చేశాడు. ఆ వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. హిందీ మూవీ 'పింక్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

 ముందు నుంచే హంగామా.. జాతరలా రిలీజ్

ముందు నుంచే హంగామా.. జాతరలా రిలీజ్

దాదాపు మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుండడంతో.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ హంగామా చేశారు. 'వకీల్ సాబ్' కోసం థియేటర్లను పెళ్లి కూతుళ్లలా ముస్తాబు చేశారు. ఏదైన పండుగకు జాతరలు జరుగుతున్నాయా అన్నట్లు సందడి చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, క్షీరాభిషేకాలు, కొబ్బరి కాయలు కొట్టడం వంటివి చేస్తూ తమ అభిమానాన్ని చాటారు.

గ్రాండ్‌గా విడుదల.. అన్ని చోట్లా ఒకేలా టాక్

గ్రాండ్‌గా విడుదల.. అన్ని చోట్లా ఒకేలా టాక్

'వకీల్ సాబ్' మూవీ నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అయింది. మరికొన్ని చోట్లా ఇది స్పెషల్‌గా వేశారు. ఇక, అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు.

అంతటా సంబరాలు.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అంతటా సంబరాలు.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

లాంగ్ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గ్యాప్ ఇచ్చినా పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అయ్యేలా సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన, టాక్ వస్తుండడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అలాగే, పల్లెల నుంచి పట్టణాల వరకూ ఉన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఉగ్గబట్టుకోలేకపోయిన ఫ్యాన్స్.. రచ్చ చేశారు

ఉగ్గబట్టుకోలేకపోయిన ఫ్యాన్స్.. రచ్చ చేశారు

'వకీల్ సాబ్' విడుదల సందర్భంగా శుక్రవారం పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తీన్మార్ స్టెప్పులు, బాణాసంచా వెలుగులతో తమ అభిమాన హీరోకు ఘనమైన స్వాగతం పలికారు. ఇదంతా ఒకవైపు మాత్రమే.. మరోవైపు సినిమా పడని థియేటర్లు, బెనిఫిట్ షోలు వేయని సినిమా హాళ్ళపై దాడులు చేసి ధ్వంసం చేశారు. మొత్తంగా రచ్చ రచ్చ చేశారు.

పవన్ కోసం రక్తం చిందించిన అభిమానులు

పవన్ కోసం రక్తం చిందించిన అభిమానులు

ఇండియాలో మాత్రమే సినిమా వాళ్ల పట్ల మితిమీరిన అభిమానం కనిపిస్తుంటుంది. అది కూడా దక్షిణాదిలో మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే 'వకీల్ సాబ్' రిలీజ్ సందర్భంగా చాలా మంది అభిమానులు పిచ్చి పిచ్చి పనులు చేసి రక్తం చిందించారు. ఇలాంటి పనులు మానుకోవాలని హీరోలు చెబుతూనే ఉన్నా.. వాళ్లు మాత్రం అభిమానాన్ని ఆపుకోలేకపోతున్నారు.

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
ఏకంగా ‘వకీల్ సాబ్' దగ్గరకెళ్లి అలా చేశాడు

ఏకంగా ‘వకీల్ సాబ్' దగ్గరకెళ్లి అలా చేశాడు

సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనికి కారణం ఓ అభిమాని తన చేతిని కోసుకుని.. వకీల్ సాబ్ మూవీ ప్రదర్శితమవుతోన్న థియేటర్ల స్క్రిన్‌పై PSPK అని రక్తం రాయడమే. అవును.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ వీడియో మాత్రం హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన వారంతా అతడిని తిడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X