ఆ రికార్డుపై కన్నేసిన పవన్ అభిమానులు.. 24గంటల్లో న్యూ టార్గెట్!
ఒకప్పుడు సినిమా హిట్టయ్యిందని టాక్ వస్తే అభిమానుల హంగామా థియేటర్స్ వద్దే ఎక్కువగా కనిపించేది. నిజంగా సినిమా సక్సెస్ అయితే హీరోల కంటే కూడా అభిమానులే ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. చిన్న ఫొటో విడుదలైన కూడా సోషల్ మీడియాలో నెంబర్ ట్రేండింగ్ లిస్ట్ లో ఉండాల్సిందే అనేలా కష్టపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫస్ట్ గ్లింప్స్ తో రికార్డులు బ్రేక్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నారు.

మొదలైన బజ్..
స్టార్ హీరోల ఫస్ట్ లుక్ రిలీజైనా, ట్రైలర్, సాంగ్స్ వంటివి రిలీజైనా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఈ రోజుల్లో కామన్ గా మారిపోయింది. ట్విట్టర్ లో లైక్స్ నుంచి యూ ట్యూబ్ లలో వ్యూవ్స్ వరకు ఒక వార్ లాగా అభిమానుల మధ్య పోటీ జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో రానున్న సినిమాపై కూడా ఇప్పుడు అలాంటి బజ్ నెలకొంది.

టార్గెట్స్ రెడీ
హిస్టారికల్ పిరియాడిక్ ఫిల్మ్ గా రూపొందుతున్న పవన్ కళ్యాణ్ 27వ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురువారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే అభిమానులు బలమైమ టార్గెట్ తో సిద్ధమవుతున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తోనే గత సినిమాల రికార్డులను బ్రేక్ చేయాలని టార్గెట్స్ రెడీ చేసుకుంటున్నారు.

అత్యదిక లైక్స్ అందుకున్న ఫస్ట్ గ్లింప్స్
ఇప్పటివరకు యూ ట్యూబ్ లో విడుదలైన టాలీవుడ్ ఫస్ట్ గ్లింప్స్ లలో రాధే శ్యామ్ 24గంటల్లో 395k లైక్స్ అందుకుంది. ఇదే హయ్యెస్ట్. ఇక మెగాస్టార్ చిరంజీవి హిస్టారికల్ ఫిల్మ్ సైరా ఫస్ట్ గ్లింప్స్ 287లైక్స్ తో రెండవ స్థానంలో ఉండగా.. మహేష్ బాబు మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ద్విభాషా చిత్రం స్పైడర్ 190లైక్స్ తో రెండవ స్థానంలో నిలిచింది.

పవన్ నెవర్ బిఫోర్ లుక్
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ 24గంటల్లో ఏ స్థాయిలో లైక్స్ అందుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడు కాబట్టి తప్పకుండా పాత రికార్డులను బ్రేక్ చేయవచ్చని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











