సోషల్ మీడియాలో పవన్ అభిమానుల బీభత్సం.. మహేష్ రికార్డుకు దగ్గరలో..

టాలీవుడ్ లో సోషల్ మీడియా రికార్డలు రోజురోజుకి అంచనాలను మించిపోతున్నాయి. కరోనా వైరస్ వచ్చినా కూడా అభిమానుల జోరు తగ్గడం లేదు. ఎదో ఒక విధంగా తమ హీరోలపై ఉన్న ప్రేమను గొప్పగా చాటుకోవాలని ఒక యుద్ధమే చేస్తున్నారు. ఒక హీరో పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది అంటే చాలు మిగతా హీరోలు కూడా వారి హీరో పేరు ఎదో ఒక విధంగా రికార్డులు బద్దలు కొట్టేలా చేస్తున్నారు.

ఇక పవర్ స్టార్ అభిమానులు కూడా ట్విట్టర్ వరల్డ్ లో పవన్ కళ్యాణ్ బర్త్ డే CDPని వైరల్ అయ్యేలా చేస్తున్నారు. కొన్ని వారాల క్రితమే అడ్వాన్స్ విషెస్ తో రికార్డు క్రియేట్ చేసిన జన సైనికులు ఇప్పుడు ఆ డోస్ మరింత పెంచుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసమని ఇటీవల విడుదల చేసిన PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్ తో 40మిలియన్ల ట్వీట్స్ వెలువడ్డాయి.

Pawan kalyan fans new twitter record in 17hrs

కేవలం 17గంటల్లోనే ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. 24 గంటల్లో ఆ సంఖ్యను మరింత పెంచాలని ఇటీవల మహేష్ బాబు బర్త్ డే ట్యాగ్(60.2M) కంటే హై రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఇంకా చాలా సమయం ఉంది.

అయినప్పటికీ అడ్వాన్స్ విషెస్ తోనే జనసైనికులు పాత రికార్డులు లేకుండా చేస్తున్నారు. చూస్తుంటే భవిష్యత్తులో ఈ ట్విట్టర్ యుద్ధాలు మరింత వైరల్ అయ్యేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నుంచి వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరి ఆ సినిమా వస్తే అభిమానులు ఇంకా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X