రీ రిలీజ్ ట్రెండ్.. ఈసారి ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్?

టాలీవుడ్ లో నడుస్తున్న రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల అభిమానులు తమ హీరోలకి సంబందించిన పాత సినిమాలని మరల 4కె వెర్షన్ లో థియేటర్స్ లో స్పెషల్ షోలుగా ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్రత్యేక షోలు వేయడం ద్వారా ఆదాయం కూడా భాగా వస్తూ ఉండటంతో నిర్మాతలు కూడా స్పెషల్ షోలు ప్రదర్శించడానికి రెడీ అయిపోతున్నారు.

మొన్నటి వరకు హిట్ సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడిస్తే ఆరెంజ్ సినిమా రీరిలీజ్ తర్వాత డిజాస్టర్ మూవీస్ కూడా మళ్ళీ రిలీజ్ చేసి భారీగా కలెక్ట్ చేయొచ్చు అనే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలకి సంబందించిన పాత సినిమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకి తీస్తూ మళ్ళీ థియేటర్స్ లో వదులుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా దేశముదురు సినిమాని రీరిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. ప్రత్యేకంగా సిటీ సెంటర్స్ లో కొన్ని షోలు మాత్రమే ఫుల్ అయ్యాయి.

 pawan kalyan fans pre release plan for gudumba shankar re release

ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ గుడుంబా శంకర్ సినిమాలో 4కె వెర్షన్ లో రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం డిజిటల్ ప్రింట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఆరెంజ్ తరహాలోనే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని గ్రాండియర్ గా రిలీజ్ చేయడానికి ఫ్యాన్స్ ప్రత్యేకషోల కోసం ఇప్పటి నుంచె రంగం సిద్ధం చేస్తున్నారని ప్రచారం నడుస్తుంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కూడా పోకిరి మూవీని మరోసారి రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారంట. టాలీవుడ్ లో ఈ రీరిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యిందే పోకిరి మూవీతో అయితే ఫస్ట్ టైమ్ భాగానే రీచ్ అయిన కూడా తరువాత వచ్చిన ఖుషి మూవీ పోకిరి రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ నేపధ్యంలో మరల పోకిరి మూవీని గ్రాండియర్ గా ఎక్కువ స్క్రీన్స్ లో రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక స్పెషల్ షోలతో కచ్చితంగా తమ హీరోల పేరుతో రికార్డులు క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనే మాట వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X