మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పై మరో క్లారిటీ వచ్చేసింది.. పవర్ స్టార్ ఫ్యాన్స్.. గేట్ రెడీ!
కరోనా లాక్ డౌన్ తో చాలామంది స్టార్ హీరోలు వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల ఎక్కువ గ్యాప్ రావడం వలన స్టార్స్ ఎక్కువగా భవిష్యత్తు ప్రాజెక్టులు కాస్త భిన్నంగా ఉండాలని ఎక్కువగానే ఆలోచించరు. అందుకే సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మల్టీ స్టారర్ కథలు రెడీ అవుతున్నాయి. అలాగే ఒక హీరో సినిమాలు మరొక హీరో నిర్మిస్తుండడం ఒక ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ వాతావరణం వల్ల కూడా అభిమానుల్లో కూడా ఒక స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఎవరికైనా సరే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కాంబో అంటే అమితమైన ఆసక్తి ఉంటుందని చెప్పవచ్చు . ఆ వార్తలు రావడానికి కూడా ఒక బలమైన కారణం అయితే ఉంది.

మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ అభిమానులకు మంచి కిక్కయితే ఇస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తప్పకుండా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందకి కూడా ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సోషల్ మీడియాలో మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమా హిట్టయితే మహేష్ బాబు భవిష్యత్ ప్రాజెక్టులు కూడా మరింత బజ్ క్రియేట్ అవ్వడం పక్కా.

పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు కాంబో..
సర్కారు వారి పాట అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ కూడా రంగంలోకి దిగుతున్న ట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. హారిక హాసిని ప్రొడక్షన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలు నిర్మిస్తుందని చాలా కథనాలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని చిత్రం త్రివిక్రమ్ సన్నిహితులు ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు ప్రస్తుతం ఆ సినిమా కోసం GMB ప్రొడక్షన్ ను మరో భాగస్వామిగా జత చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న చర్చలు
చాలా ప్రాజెక్టులకు మహేష్ బాబు రెమ్యునేషన్ తీసుకోకుండా తన సొంత ప్రొడక్షన్ ను జత చేస్తూ లాభాల్లో వాటా అందుకుంటూ వస్తున్నాడు. వీలైనంతవరకు నిర్మాతకు ఇబ్బంది లేకుండానే మహేష్ జాగ్రత్త గా ఉంటాడు. ఇక త్రివిక్రమ్ అయితే అందుకు ఒప్పుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే త్రివిక్రమ్ కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండానే లాభాల్లో వాటా అందుకునేలా డీల్ అయితే సెట్ చేసుకున్నాడు. ముగ్గురు వాటాలు అంటే సినిమా నిర్మాతకు పెద్దగా లాభం ఉండదు. ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయని మరొక టాక్ కూడా వస్తోంది. పవన్ కళ్యాణ్ పీకే క్రియేటివ్ వర్క్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ
ఇక మరో ముఖ్యమైన విషయం లోకి వెళితే గత వారం రోజులుగా సర్కారు వారి పాట అప్డేట్స్ తో మహేష్ బాబు అభిమానులు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా పుట్టిన రోజు విడుదలైన టీజరైతే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బర్త్ డే బ్లాస్టర్ పేరుతో విడుదలైన టీజర్ ట్విట్టర్లో కూడా పాత రికార్డులను దాదాపు బ్రేక్ చేసేసింది. సినిమా తప్పకుండా సరికొత్త సెన్సేషన్ ను క్రియేట్ చేయగలరు అని అనిపిస్తుంది. అంతేకాకుండా వరుసగా సినిమా పోస్టర్స్ కూడా విడుదల చేశారు.
Recommended Video

పవన్ ఫ్యాన్స్ డిమాండ్..
ఆగస్టు 9న మహేష్ బాబు అభిమానులు ఒక టీజర్ తో భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సెప్టెంబర్ 2న అంతకుమించి అనేలా సంబరాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ప్రతి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉండాలని ఇప్పటికే పవన్ దర్శక నిర్మాతలపై అభిమానులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తున్న బడా నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేస్తూ తప్పకుండా టీజర్ విడుదల చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళం రీమేక్ మూవీ లో పాట క్రిష్ దర్శకత్వంలో హరివరం వీరమల్లు సినిమాలో చేసిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. త్వరలోనే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ రానా మూవీకి సంబంధించిన టీజర్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు మరి ఆ విషయంలో చిత్రయూనిట్ ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











