ఒకే ఒక్కడు: మీరంటే ప్రేమ, గౌరవం అంటూ పవన్ ట్వీట్!

By Bojja Kumar

పవన్ కళ్యాణ్‍‌కు ట్విట్టర్లో 3.2 మిలియన్‌పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యేది మాత్రం ఒక్కే ఒక్కరిని. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆర్మీ గురించి గొప్పగా చెబుతు చేసిన ట్వీట్‌పై అమితాబ్ స్పందించారు. జై హింద్ అంటూ పవన్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

 Pawan Kalyan follows Amitabh Bachchan in twitter

దీనికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చిన తీరు ఆకట్టుకుంది. 'గౌరవనీయ అమితాబ్‌ బచ్చన్‌ జీ.. మీరంటే నాకెంతో ప్రేమ, గౌరవం సర్‌. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు సెల్యూట్‌ చేస్తూ నేను చేసిన పోస్ట్‌ను మీరు రీట్వీట్‌ చేసినందుకు ధన్యవాదాలు. ఆ పోస్ట్‌ 'పోయెమ్స్‌ ఆఫ్‌ లవ్‌ అండ్‌ వార్‌' పుస్తకంలోనిది. ఈ పుస్తకాన్ని ఏకే రామానుజన్‌ అనే రచయిత తమిళం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. జైహింద్‌ సర్‌' అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

అమితాబ్ బచ్చన్ అంటే తనుక ఎంతో ఇష్టమైని, చిన్న తనం నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనకు వీరాభిమానిని అని గతంలోనూ పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైరా షూటింగులో కూడా అమితాబ్‌ను కలిశారు.

అమితాబ్ అంటే తనకు అంత ఇష్టం కాబట్టే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అవుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాలీవుడ్‌ను మెగాస్టార్ ను ఫాలో కావడం మొదలు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X