గ్యాప్ వచ్చినా అలీకి పవన్ ఫోన్: ఆశ్చర్యపోయిన కమెడియన్.. జాయిన్ అవుతానంటూ హామీ.!

By Manoj

Recommended Video

Pawan Kalyan Calls Comedian Ali, Follows Sentiment

కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న విషయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ న్యూస్ ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు, ఇకపై సినిమాల్లో నటించనని కూడా పలుమార్లు వెల్లడించాడు. అయినప్పటికీ పవన్ మరోసారి తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్.. వైసీపీలో చేరిన తన స్నేహితుడు అలీకి ఫోన్ చేశాడంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ పవన్ ఎందుకు ఫోన్ చేశాడు? వివరాల్లోకి వెళితే...

కమ్‌బ్యాక్ అదిరిపోయేలా ప్లాన్ చేసిన పవన్

కమ్‌బ్యాక్ అదిరిపోయేలా ప్లాన్ చేసిన పవన్


పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' సినిమాను ఎంచుకున్నారు. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సినిమా అవడంతో పాటు సోషల్ మెసేజ్ ఉండడంతోనే ఈ మూవీ రీమేక్‌కు ఒప్పుకున్నాడట పవన్. అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకోవాలనే ఇలా డిసైడ్ అయ్యాడని టాక్.

ప్రయోగాల జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్నాడు

ప్రయోగాల జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్నాడు

దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఏ ప్రయోగాలూ చేయడం లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న లుక్‌తోనే సినిమా చేయబోతున్నాడు. అదీ కాక మేనరిజమ్ చూపించే సినిమా కాదు కాబట్టి.. దర్శకుడు చెప్పినట్లే చేసుకుంటూ పోతున్నాడట పవర్ స్టార్. దీంతో ఈ సినిమాలో సరికొత్త పవన్ కనిపిస్తాడని అంటున్నారు.

మరో దానిని కూడా పట్టాలెక్కించేశాడు

మరో దానిని కూడా పట్టాలెక్కించేశాడు

‘పింక్' రీమేక్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మొదలై ఎంతో సమయం కాకముందే పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడితో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీని పిరియాడిక్ డ్రామాగా రూపొందించబోతున్నారు. ఇందులో పవన్.. స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నాడని సమాచారం.

హిట్ కాంబో రిపీట్.. బడా సంస్థతో బిగ్ డీల్

హిట్ కాంబో రిపీట్.. బడా సంస్థతో బిగ్ డీల్


ఈ రెండు సినిమాలతో పాటు తనకు ‘గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్‌ను అందించిన హరీశ్ శంకర్‌తోనూ సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ సినిమాకు గానూ మెగా హీరో భారీగా చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కబోతుందని తెలుస్తోంది.

గ్యాప్ వచ్చినా అలీకి పవన్ కల్యాణ్ ఫోన్

గ్యాప్ వచ్చినా అలీకి పవన్ కల్యాణ్ ఫోన్


తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో అలీ పేరును ప్రత్యేకంగా చెబుతారు. అంతలా ఆయన కొన్నేళ్లుగా ప్రభావం చూపిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అలీ.. పవన్‌ను కాదని మరో పార్టీలో చేరిపోయాడు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు. అయినప్పటికీ పవన్.. తాజాగా అలీకి ఫోన్ చేశాడని ఓ వార్త బయటకు వచ్చింది.

ఆశ్చర్యపోయిన అలీ.. జాయిన్ అవుతానంటూ హామీ.!

ఆశ్చర్యపోయిన అలీ.. జాయిన్ అవుతానంటూ హామీ.!

పవన్.. అలీకి ఫోన్ చేసింది సినిమాల్లో నటించడం కోసమని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన సినిమాల్లో నటించాలని పవర్ స్టార్ ఆయనకు స్వయంగా ఫోన్ చేశాడట. దీంతో అలీ కూడా కచ్చితంగా చిత్ర యూనిట్‌తో జాయిన్ అవుతానని హామీ ఇచ్చాడని సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ఎన్నో హిట్లు వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X