Ayodhya Ram Mandir కన్నీళ్లు పెట్టుకొన్నా.. ప్రాణ ప్రతిష్ట సమయంలో భావోద్వేగం.. పవన్ కల్యాణ్

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనేందుకు సినీ నటుడు, జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక రోజు ముందుగానే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చేరుకొన్నారు. అనంతరం సోమవారం ఉదయం లక్నో నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఆయనకు అయోధ్యలో ఘన స్వాగంత పలికి వీవీఐపీ లాంజ్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులకు దర్శన భాగ్యం కలిగించారు. ఆ సమయంలో బాల రాముడిని పవన్ కల్యాణ్ దర్శించుకోవడమే కాకుండా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Pawan Kalyan gets teared while Bala Rama Prana Pratishta in Ayodhya

నా జీవితంలో చాలా భావోద్వేగమైన రోజు. ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో ఏదో తెలియని అనుభూతితో నా కళ్ల వెంబటి కన్నీళ్లు వచ్చాయి. దాంతో నేను మరింత ఎమోషనల్‌గా మారాను. ఏన్నో తరాల ప్రజలు పడిన వేదనకు ఉపశమనం. చివరకు ప్రజలు ఆకాంక్ష, కోరిక సాకారమైంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట భారత దేశాన్ని ఐక్యం చేస్తుందని నమ్ముతున్నాను. దేశాన్ని ఏకం చేస్తుంది. దక్షిణాదిలో తిరుపతి తిరుమల పుణ్య క్షేత్రాన్ని పవిత్రంగా భావిస్తాం. అలాగే అయోధ్యలో కూడా రామ మందిరాన్ని అంతే పవిత్రంగా భావిస్తాం. ఇక ముందు దక్షిణాది ప్రజలు అయోధ్యను దర్శించుకొంటారు.

Pawan Kalyan gets teared while Bala Rama Prana Pratishta in Ayodhya

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జరిగిన వేడుకల్లో తెలుగు సినీ ప్రముఖుల్లో చిరంజీవి, రాంచరణ్, అభిషేక్ అగర్వాల్ పాల్గొన్నారు. తమిళం నుంచి రజనీకాంత్, బాలీవుడ్ నుంచి కంగన రనౌత్, రణ్‌బీర్, అలియా భట్, వికీ కౌశల్, కత్రినా కైఫ్, అభిషేక్, అమితాబ్ బచ్చన్ తదితరులు పాల్టొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X