పొలిటికల్ సినిమాపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. పాలకుల తప్పిదాలను నిలదీస్తా!

ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారంటూ గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. దాంతో అభిమానుల్లో తిరిగి ఉత్సాహం పుంజుకొన్నది. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని జనసేన పార్టీ పత్రికా ప్రకటనను విడుదల చేయడంతో వాస్తవం బయటకు వచ్చింది. స్వయంగా పవన్ కల్యాణ్ సంతకంతో కూడిన ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రకటనలో ఏం చెప్పారంటే..

Recommended Video

Pawan Kalyan To Do Movie In Political Theme | Filmibeat Telugu
పొలిటికల్ మూవీ అంటూ

పొలిటికల్ మూవీ అంటూ

టాలీవుడ్ మీడియాతోపాటు జాతీయ మీడియాలో కూడా పవన్ కల్యాణ్ సినిమాపై ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ముందు పవర్ స్టార్ ఓ రాజకీయ నేపథ్యంగా ఓ సినిమా చేయబోతున్నట్టు ఆ వార్త కథనంలో పేర్కొన్నారు.

డాలీ దర్శకత్వంలో మూవీ

డాలీ దర్శకత్వంలో మూవీ

పొలిటిక్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారని, ఆ చిత్రానికి గోపాలా గోపాలా దర్శకుడు డాలీ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ గానీ, సాయి ధరమ్ తేజ్ గానీ నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

పవన్ కల్యాణ్ ఖండన

పవన్ కల్యాణ్ ఖండన

పొలిటిక్ బ్యాక్ డ్రాప్‌‌గా వస్తుందంటూ వచ్చిన వార్తను జనసేన పార్టీ తరపున పవన్ కల్యాణ్ ఖండించారు. అలాంటిదేమీ లేదని క్లియర్ కట్‌గా ప్రకటనలో చెప్పారు. నేను త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలో నిజం లేదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

జనసైనికులు, అభిమానులతోనే

జనసైనికులు, అభిమానులతోనే

సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికి పూర్తి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటాను. జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే. నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే అని ప్రకటనలో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X