Ayodhya Ram Mandir: 3 ఏళ్ల క్రితమే అయోధ్యకు పవన్.. సరిగ్గా అదే 22 తేదీన.. నువ్వు దేవుడివి సామీ!
అయోధ్య రామ మందిరం.. కొంత కాలంగా ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో ఇది ఒకటి. అంతలా దీనికి ప్రాధాన్యం ఉంది. దాదాపు 500 ఏళ్ల నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ, ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురైంది.
అయితే, ఈ సారి మాత్రం అక్కడ మందిరాన్ని నిర్మించడంతో పాటు బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కూడా చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ఒక పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూసేయండి!

అత్యున్నత కార్యంగా: అయోధ్య రామ మందిరం విషయంలో సుదీర్ఘ కాలంగా కొన్ని కోట్ల మంది కన్న కల సాకారం అయింది. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మందిరాన్ని నిర్మించడంతో పాటు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీన జరిపింది. దేశంలోనే గతంలో ఎన్నడూ జరగనంత గొప్ప కార్యంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

మెగా ఫ్యామిలీ కూడా: అయోధ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీన జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇండియా వ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యంగా ఫిల్మ్ సెలెబ్రిటీలను ఈ కార్యక్రమానికి పిలిచారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు చిరంజీవి, పవన్, చరణ్ హాజరయ్యారు.
పవన్ భావోద్వేగంగా: అయోధ్య కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 'నా జీవితంలో చాలా భావోద్వేగమైన రోజు. ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో ఏదో తెలియని అనుభూతితో నా కళ్లు చెమర్చాయి. దీంతో నేను మరింత ఎమోషనల్ అయ్యాను. ఏన్నో తరాల ప్రజలు పడిన వేదనకు ఉపశమనం లభించింది. చివరకు ప్రజలు ఆకాంక్ష, కోరిక సాకారమైంది' అని చెప్పుకొచ్చాడు.

పవన్ హాట్ టాపిక్‌గా: అయోధ్య నగరంలో జరిగిన మహోన్నత కార్యక్రమంలో ఎన్నో అంశాలు బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా కొందరు సెలెబ్రిటీలు అక్కడ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లిన వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం గతంలో అతడు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళమే.
సరిగ్గా అదే తేదీన: అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఎంతో మంది ప్రముఖులు దీనికోసం విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా 2021, జనవరి 22వ తేదీన రామ మందిర నిర్మాణం కోసం రూ. 30 లక్షలు ఇచ్చాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత అదే తేదీన అయోధ్య మందిరం ప్రారంభం అయింది.
నువ్వు దేవుడివి సామీ: పవన్ కల్యాణ్ విరాళం ఇచ్చిన మూడేళ్ల తర్వాత అదే రోజున అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కావడం, బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడం ఇప్పుడు హట్ టాపిక్ అవుతోంది. సరిగ్గా అదే తేదీన ఈ రెండూ జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పవన్ ఫ్యాన్సైతే నువ్వు దేవుడివి సామీ అంటూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటోన్నారు.


Click it and Unblock the Notifications











