చాలా కాలం తరువాత జిమ్ లో బిజీ అయిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా కోసం తప్పట్లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్లో ఉన్న ప్రాజెక్టులు వేటికవే భిన్నంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం అయితే అందరి ఫోకస్ ఎక్కువగా హరిహర వీరమల్లు సినిమాపై ఉంది. అలాగే మరికొన్ని రీమేక్ ప్రాజెక్టులను కూడా పవన్ కళ్యాణ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత జిమ్ లో మళ్ళీ వర్కౌట్ చేస్తూ బాడీ షేప్ లో కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏ ప్రాజెక్టు కోసం పవన్ ఈ విధంగా చేస్తున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

ఒకవైపు సినిమాలు..

ఒకవైపు సినిమాలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాల్లో ఎంతో బ్యాలెన్స్ డ్ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. వీలైనంతవరకు ఎక్కువగా పాలిటిక్స్ లోనే ప్రజాసమస్యలపైనే ఫోకస్ గా ఉంటున్న పవన్ గ్యాప్ దొరికినప్పుడు మాత్రం షూటింగ్స్ పనులను పూర్తి చేసుకుంటున్నాడు. హరిహర వీరమల్లు ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ పవన్ కారణంగా ఆ ప్రాజెక్టు చాలా సార్లు వాయిదా పడింది.

వీరమల్లు ఎంతవరకు వచ్చిందంటే..

వీరమల్లు ఎంతవరకు వచ్చిందంటే..

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కమిట్మెంట్ లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలి కాబట్టి పవన్ నిర్మాతలను కూడా ఇబ్బంది పెట్టకూడదని రాబోయే రోజుల్లో మరింత హార్డ్ వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే హరిహర వీరమల్లు 70% వరకు పూర్తయినట్లు సమాచారం. మరికొంత షూటింగును తొందరగా పూర్తి చేసి సినిమాను ఇదే ఏడాది దసరా సమయానికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెడీ

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెడీ

అలాగే పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముందుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది మళ్ళీ తేరి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకువచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో ఆ ప్రాజెక్టును మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు.

మరో రీమేక్ కూడా..

మరో రీమేక్ కూడా..

ఇక ఇటీవల యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓజి అనే ట్యాగ్ తో ఆ సినిమా లాంచ్ వేడుక కూడా జరిగింది. కేవలం ఈ సినిమా కోసం పవన్ 40 రోజుల షెడ్యూల్ మాత్రమే కేటాయించినట్లు సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ వినోదాయ సీతం రీమేక్ ను కూడా మొదలుపెట్టబోతున్నాడు. ఇందులో సాయిధరమ్ తేజ్ మరో హీరోగా కనిపించబోతున్నాడు.

 ఫిట్నెస్ లో మార్పులు..

ఫిట్నెస్ లో మార్పులు..

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన ఫిట్నెస్ లో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొంత లావుగా ఉండడంతో పవన్ బరువు తగ్గాలి అని డిసైడ్ అయ్యారట. వినోదయ సీతం కోసమే పవన్ బరువు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ రచనలో సముద్రఖని ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. అసలైతే ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 14వ తేదీన స్టార్ట్ కావాలి. మరి కొన్ని కారణాల వలన మరో వారం వాయిదా పడింది. ఇక ముందుగా సాయిధరమ్ తేజ్ కు సంబంధించిన సన్నివేశాలతో షూటింగ్ మొదలుకానుంది. ఇక పవన్ కళ్యాణ్ ఆలస్యంగానే షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X