Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Pawan Kalyan: ఫొటో కోసం మహిళల ఎదురుచూపులు.. అలా స్టిల్ ఇచ్చి ఆశ్చర్యపరిచిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎంతగా క్రేజ్ అందుకున్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతాడు అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక వ్యక్తి ఎవరైనా తనను కలవడానికి వస్తున్నాడు అంటే వారిని ఎంతో ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటాడు. స్థాయిని పట్టించుకోకుండా అభిమానులను కూడా ఎంతగానో గౌరవించే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో తన స్థాయిని ఏమిటి అని చూడకుండా చాలా సింపుల్గా వారితో ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొందరు మహిళలతో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీతో చాలా బిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ మరోవైపు తన రెగ్యులర్ సినిమాలను కూడా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఎక్కువగా మాత్రం రాజకీయ కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. ఇక రీసెంట్గా జనసేనలో ఎంతో నిమగ్నంగా పనిచేస్తున్న మహిళలతో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

ఈ క్రమంలో అందరితో ఫోటోలు దిగే సమయం లేకపోవడంతో ఆయన అందరికీ ఒకేసారి ఫోటో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే నిలబడితే కొందరు మిస్ అవుతారు అని అక్కడ స్టేజి పైనే కూర్చుని ఫోటోకి స్టిల్ ఇచ్చారు. దాదాపు సెల్ఫీ తరహాలో ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి స్టార్ హీరో మంచితనానికి ఫిదా అవుతున్నారు.
రాజకీయాల్లో దారుణంగా ఓటమిపాలైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజల పక్షాన నిలబడేందుకు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇటీవల కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు కూడా సిద్ధమయ్యారు. వారికోసం ప్రత్యేకంగా విరాళాలు సేకరించి సహాయం కూడా చేశారు. అంతేకాకుండా జనసేన కార్యకర్తలతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జరిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్నారు.