మరో నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. లైన్ లోకి కొత్త ప్రాజెక్ట్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వేగవంతంగా సినిమలు చేస్తున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫెరెంట్ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నాడు. వకీల్ సాబ్ తోనే తన మార్కెట్ రేంజ్ ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక నెక్స్ట్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లుపై కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే ఒక కథను ఫిక్స్ చేయగా మాస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. లైన్ లో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ కమిట్మెంట్స్ ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

అయితే తన పరిస్థితిని అర్థం చేసుకునే నిర్మాతలకు మాత్రమే పవన్ డేట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇటీవల కోనేరు సత్యనారాయణ కూడా అదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ తో కమిట్మెంట్ తీసుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఈ నిర్మాత ఇదివరకే రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఖిలాడి - రాక్షసుడు 2 సినిమాలతో రాబోతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథల కోసం సెర్చ్ చేస్తున్నారట. ఏదైనా రీమేక్ అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారట. ఒకవేళ ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే ప్రస్తుతం ఉన్న సినిమాలు ఫినిష్ చేసిన తరువాతే పవన్ కొత్త సినిమాను స్టార్ట్ చేయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











