ఫ్యాన్స్ దమ్ముంటే దాడి చేయండి.. సినిమాపై ట్రోలింగ్‌కు నలిగిపోకండి.. పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన హరి హర వీరమల్లు మూవీ గ్రాండ్‌గా రిలీజైంది.ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేశాడు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు అనే విషయం తెలిసిందే. . నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు.
జూలై 24న విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో ఈ చిత్రం యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో మీడియా సమక్షంలో జరుపుకొన్నారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా సినిమా హరిహర వీరమల్లును బాయ్‌కాట్ చేస్తామని బెదిరిస్తే భయపడను. మీరు ఏం చేయాలనుకొంటారో అది చేయండి అని అన్నారు.

గతంలో చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వం అంటూ బెదిరించారు. కానీ నేను నెల్లూరులోని విధుల్లో పెరిగిన వాడిని. ఇక్కడి వరకు రావడమే గొప్ప. మీరు నా సినిమాలు ఆపుతామంటే.. నేను ఎంత ఎత్తుకు ఎదిగానో మీరు చెబుతున్నారు. ఎవడో ఒక హీరో సినిమా తీస్తే.. అది మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నన్ను ఓ క్విట్ ఇండియా మూమెంట్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. ఏం చేస్తారో చేయండి. ఏం తేడా పడుతుందో చూద్దాం. ఇవన్నీ చూడకుండానే నేను ఇక్కడి వరకు వచ్చానా? ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడను. ముఖ్యంగా నా అభిమానులకు మీడియా ద్వారా చెప్పేదేమిటంటే.. నేను ఇలా బలంగా ఉన్నానంటే.. మీరు ఇచ్చిన బలమే అంటూ పవన్ కల్యాణ్ ఉత్తేజకరమైన ప్రసంగాన్ని కొనసాగించారు.
నేను గమనించిందేమిటంటే.. సక్సెస్ రాకపోతే చేతి వేళ్లు కొరుక్కుంటూ ఎదో కోల్పోయినట్టు కనిపిస్తారు. ఏదైనా సినిమా బాగా లేకపోతే కుంగిపోయి బాధపడుతుంటారు. ఆ రెండు పనులు నేను చేయలేను. 2019 సంవత్సరంలో నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు వీడు ఎలా ఉంటాడో చూద్దామని కొందరు వెయిట్ చేశారు. ఎంత అవమానానికి గురవుతాడో చూద్దామని అనుకొన్నారు. కానీ నేను పల్లెటూల్లో పుట్టి యాక్టర్‌గా హిట్ అయ్యి.. పార్టీ పెట్టి ఓడిపోయాం. అది నాకు సక్సెస్ అనిపిస్తుంది. ఆ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ. అలా ఎంజాయ్ చేశాను కాబట్టే డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకే సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేను అని పవన్ కల్యాణ్ అన్నారు.
నా అభిమానులకు చెప్పేది ఏమిటంటే? మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరంతా చేతి వేళ్లు కొరుక్కొంటూ టెన్షన్ పడకండి. మీరు సున్నితంగా ఎందుకుంటారు? నేను కదా దెబ్బలు తింటున్నది. మీరు ఈజీగా ఎంజాయ్ చేయండి. అంతేగీనీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్‌కు నలిగిపోకండి. మీకు దమ్ముంటే దాడి చేయండి. నెగిటివ్ కామెంట్స్‌కు కొట్టి నిలదీయండి అంటూ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చాడు.


Click it and Unblock the Notifications











