twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak సెట్స్‌లో గన్‌తో పవన్ హల్‌‌చల్: రాయల్‌గా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. వీడియో వైరల్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనలోని టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

    సినిమా రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసుకుంటూ వెళ్లే పవర్ స్టార్.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'భీమ్లా నాయక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో పవన్ కల్యాణ్ గన్ ఫైరింగ్ చేసిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

    Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. తుపాకితో గురిచూసి కాల్చిన మోనిత!

    ‘వకీల్ సాబ్'తో రీఎంట్రీ.. మరో మూడు రెడీ

    ‘వకీల్ సాబ్'తో రీఎంట్రీ.. మరో మూడు రెడీ

    పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సినిమాలకు బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది.

    ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇది పట్టాలపై ఉండగానే పవన్ కల్యాణ్.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా, క్రిష్ జాగర్లమూడితో ఒకటి, హరిశ్ శంకర్‌తో మరో ప్రాజెక్టును ఓకే చేశారు. వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పూర్తి చేస్తూ వెళ్తున్నాడు.

    టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

    ‘భీమ్లా నాయక్'గా మారిన పవన్ కల్యాణ్

    ‘భీమ్లా నాయక్'గా మారిన పవన్ కల్యాణ్

    'వకీల్ సాబ్' సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు.

    రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    ఇద్దరు ఇగోల కథతో.. రెండు పాత్రలు ఇవే

    ఇద్దరు ఇగోల కథతో.. రెండు పాత్రలు ఇవే

    ఆధిపత్యం చూపించాలనుకునే ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కిన చిత్రమే 'అయ్యప్పనుమ్ కోషియం'. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు నేటివిటీకి అనుకూలంగా మార్చి 'భీమ్లా నాయక్' మూవీని తెరకెక్కిస్తున్నారు.

    ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

    ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోతఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

    భీమ్లా నాయక్ పాత్ర వీడియోను వదిలారు

    భీమ్లా నాయక్ పాత్ర వీడియోను వదిలారు

    'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు 'భీమ్లా నాయక్' అనే టైటిల్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైంది. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ వీడియో పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ మేనరిజం.. మాస్ అవతార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనికితోడు ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచిందనే చెప్పాలి.

    వీడియోతో రికార్డులు బ్రేక్ చేసిన పవర్ స్టార్

    వీడియోతో రికార్డులు బ్రేక్ చేసిన పవర్ స్టార్

    ఇటీవల విడుదలైన 'భీమ్లా నాయక్' ఇంట్రడక్షన్ వీడియోకు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ లుంగీ కట్టుకుని ఊరమాస్ గెటప్‌తో కనిపించడంతో ఇది హైలైట్ అయిపోయింది.

    ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు ఇలా ఎన్నో లైకులు, వ్యూస్‌ను సంపాదించింది. తద్వారా టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇక, ఈ వీడియోకు 24 గంటల్లోనే దీనికి 8.49 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, 728.6K లైకులు కూడా దక్కాయి.

    సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!

    భీమ్లా నాయక్ సెట్స్‌లో గన్‌తో పవర్ స్టార్

    'భీమ్లా నాయక్' ఇంట్రడక్షన్ వీడియో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రం నుంచి రానా దగ్గుబాటి వీడియోను కూడా విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మూవీ యూనిట్ నుంచి ఓ అదిరిపోయే వీడియో విడుదలైంది. ఇందులో షూటింగ్ గ్యాప్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. తన వెహికిల్ మీద ఒక కాలేసి.. గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపిస్తోన్నాడు పవన్. ఇందులో పవర్ స్టార్ తనదైన స్టైల్‌తో కనిపించాడు. రాయల్‌గా ఉన్న ఈ వీడియోకు భారీ స్పందన వస్తోంది.

    Recommended Video

    Pspk rana movie glimpse
    నాయకుడు కదుల్తాడు అంటూ క్యాప్షన్

    నాయకుడు కదుల్తాడు అంటూ క్యాప్షన్

    ఈ వీడియో మొత్తం పవన్ కల్యాణ్ గన్ ఫైరింగ్ చేస్తున్న దృశ్యాలు చూపించారు. ఇక, చివర్లో అతడు తుపాకీని తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు పక్కన 'యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకు ప్రాణధారలు వదులుతాడు.. యోధుడు తుపాకీ గొట్టం అంచు నుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు.. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు' అంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. తద్వారా పవన్ కల్యాణ్‌ను సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్‌ను ఇందులో సాక్షాత్కరించినట్లైంది. ఫలితంగా ఈ వీడియో వైరల్ అయిపోయింది.

    English summary
    Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Recently Pawan Kalyan Gun Firing Video Released From This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X