Don't Miss!
- News
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం.. ఆ సేవలు నిలిపివేత!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కూడా పునకాలు వచ్చేలా.. క్రిష్ మరో క్రేజీ అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న సినిమాను ఏఎమ్.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కు దర్శకుడు ఒక అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

చారిత్రాత్మక నేపథ్యంలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇకనుంచి చేయబోయే సినిమాలు మరొక లెక్క అనే విధంగా కొన్ని కథలు తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. ఆ సినిమాలో పవన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

పర్ఫెక్ట్ ప్లానింగ్
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇటీవల పవన్ అలాగే దర్శకుడు క్రిష్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా ఆలస్యం కావడంతో సినిమాను సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరో గ్లింప్స్
ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా మరింత డోస్ పెంచాలని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఇదివరకే విడుదల చేశారు. ఇక త్వరలోనే మరో గ్లింప్స్ కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరికొన్ని పాత్రలను కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అలాంటి పాత్రలో పవన్
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా ఎంతో పాజిటివ్ గా ఉంటుందట. ఉన్నవారి నుంచి దోచుకుని లేని వారికి దానం చేసే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడట. ముఖ్యంగా ఇందులో ఉండే యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

డేట్ కూడా ఫిక్స్
ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు మరొక రెండు మూడు నెలల్లో పూర్తి కాబోతున్నాయి. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. అందుకు సంబంధించిన పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. మరి ఆ అప్డేట్ ఫ్యాన్స్ కు ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి.