పవర్ఫుల్ వారియర్‌గా సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్.. హై వోల్టేజ్ లుక్స్.. ఫొటోస్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక పిరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తాడని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. పవన్ పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Pawan Kalyan Dedication towards Hari Hara Veera Mallu | Filmibeat Telugu
స్పెషల్ ఎట్రాక్షన్ గా..

స్పెషల్ ఎట్రాక్షన్ గా..

17వ శతాబ్దానికి సంబంధించిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా కోసం భారీ స్థాయిలో కొన్ని సెట్స్ లను నిర్మించారు. చార్మినార్ సెట్ పాటు గండికోట లాంటి మరొక సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. సినిమాలో సెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తాయట.

బల్లెంతో పవర్ స్టార్

బల్లెంతో పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫిజికల్ గా చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మార్షల్ ఆర్ట్స్ తరహాలో బల్లెంతో పవర్ స్టార్ చేసే ఫైట్స్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ సరికొత్త లుక్కుతో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

శ్రద్ధగా నేర్చుకుంటున్న పవన్

శ్రద్ధగా నేర్చుకుంటున్న పవన్

ఇక కొద్దిసేపటి క్రితమే షూటింగ్ లొకేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. పవన్ ఎంతో శ్రద్ధగా స్టంట్ మాస్టర్ నుంచి నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ స్టార్ట్ అయ్యే కొన్ని గంటల ముందే ఈ విధంగా ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడట. ఇక పవన్ కళ్యాణ్ స్టిల్స్ చూస్తుంటే సినిమాలో సరికొత్త కిక్కివ్వబోతున్నట్లు అర్ధమవుతోంది.

టైమ్ లెక్క చేయకుండా..

టైమ్ లెక్క చేయకుండా..

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు పవన్ ఏ మాత్రం బ్రేకులు వేయడం లేదు. ఒకవైపు అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ పనులు కొనసాగుతున్నా కూడా క్రిష్ సినిమాను ఆపడం లేదు. అవసరం ఉన్నప్పుడు టైమ్ చూసుకోకుండా వర్క్ చేస్తున్నాడు. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఆ సమయానికి మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X