యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ 12 గంటలు కోమాలోనే.. పవన్ కల్యాణ్ ఏం చేశారంటే?
టాలీవుడ్‌లో స్టార్ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించిన చిత్రం బ్రో సినిమాకు నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళంలో గ్రాండ్ సక్సెస్ అయిన వినోదయ సీతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సాయిధరమ్ తేజ్ గురించి పవన్ కల్యాణ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..
బ్రో ది అవతార్ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ ఈ సినిమాను ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేశారు. సాయిధరమ్ తేజ్ సినిమాల్లోకి వస్తానని చెబితే.. నేను ప్రోత్సహించలేదు. నిరాకరించలేదు. ఒకరి ప్రతిభను అడ్డుకోవడానికి నేను ఎవరిని అనే భావనలో ఉంటాను. ఒకరినిని ఆపడానికి నేను ఎవరిని అని ఆయనకు పరీక్ష పెట్టాను. సాయిధరమ్ తేజ్ శక్తిని పరీక్షించేందుకు యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించాను. వైవీఎస్ చౌదరీ కూడా సాయిధరమ్ తేజ్ ప్రతిభను గుర్తించి సినిమా చేశారు.

బ్రో సినిమాకు ముందు సాయిధరమ్ యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో నేను, త్రివిక్రమ్ కలిసి ఉన్నాను. సాయిధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయిందని త్రివిక్రమ్‌కు ఫోన్ వచ్చింది. హాస్పిటల్‌కు వెళ్లి చూస్తే కోమాలో ఉన్నాడు. ఈ సినిమా కథకు, సాయిధరమ్ తేజ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనకు సంబంధం ఉంది.
యాక్సిడెంట్ తర్వాత 24 గంటల వెయిట్ చేసినా గానీ.. కోమాలో నుంచి బయటకు రావడం లేదు. నాకు నిస్సహయత పెరిగిపోయింది. అప్పటికి సాయిధరమ్ తేజ్‌ను అబ్దుల్ సయ్యద్ ఫర్హాన్ రక్షించాడు. నేను కులం, మతం గురించి పట్టించుకోనంటే.. ఎవరికి ఎప్పుడు సాయం ఎవరి నుంచి కావాల్సి వస్తుందో తెలియదు. మన మతమా? కులమా? ప్రాంతామా అని తెలియదు. మానవత్వం మనకు ముఖ్యం అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
సాయిధరమ్ తేజ్ ఈ రోజు మనముందు ఉన్నారంటే.. అందుకు కారణం అబ్దుల్ సయ్యద్ ఫర్హాన్. ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనను నేను ఎప్పుడు గుండెల్లో పెట్టుకొంటాను. సకాలంలో స్పందించినందు వల్లే సాయిధరమ్ తేజ్ బతికాడని నమ్ముతాను. సాయిధరమ్ తేజ్‌ను బతికించడానికి అపోలో, మెడి కవర్ వైద్యులు విశేషంగా కృషి చేశారు. ఆ సమయంలో దేవుడి గుడికి వెళ్లలేదు. యాగాలు చేయలేదు. కానీ ఓ మూల కూర్చొని సాయిధరమ్ తేజ్‌ను బతికించమని భగవంతుడిని వేడుకొన్నాను. జగన్మాతను పూజిస్తాను కాబట్టి సాయిధరమ్ తేజ్ కోసం ప్రార్థించాను. నేను చాలా మందిని రక్షించాను. తొలి ప్రేమ షూటింగులో యాక్సిడెంట్ జరిగితే నేనే స్వయంగా తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించాను. అని పవన్ కల్యాణ్ చెప్పారు.

యాక్సిడెంట్ నుంచి కోలుకొని సాయిధరమ్ తేజ్ మాట్లాడలేకపోయాడు. ఆ సమయంలో ఈ సినిమాను ఎవరికి ఇద్దామని అంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. తేజ్‌కు ఇస్తామని అన్నారు. ఆ సమయంలో హస్పిటల్‌లో కోమాలో ఉన్నాడు. మరెవరితోనైనా చేద్దామా? అని అంటే.. తేజ్ కోలుకొనే వరకు వెయిట్ చేద్దామని త్రివిక్రమ్ అన్నాడు. సాయిధరమ్ తేజ్ ఈ సినిమా చేయడానికి కారణం త్రివిక్రమ్ అని పవన్ కల్యాణ్ చెప్పారు.
బ్రో సినిమా షూటింగులో సాయిధరమ్ తేజ్ ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో సముద్రఖనిని అడిగాను. ఏమైనా ఇబ్బందా? అంటే.. నా బ్రదర్‌ను నేను చూసుకొంటాను. నా బిడ్డ గురించి మీరు ఆందోళన చెందకండి అని అన్నారు. అందుకు సముద్రఖనికి నా ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ అన్నారు.
బ్రో సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. బాధపెడుతుంది. ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి సినిమాను అందించిన సముద్రఖని, త్రివిక్రమ్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











