నా ప్రయాణాన్ని గుర్తు చేశారు.. జనగళం అంటూ పవన్ కల్యాణ్ ఎమోషనల్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున అభిమానులు, ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో సునామీ సృష్టించారు. దిన పత్రిలకు, టెలివిజన్ ఛానెళ్లు, వెబ్‌సైట్లు ప్రత్యేక కథనాలు, రోజంతా అప్‌డేట్స్ అందిస్తూ అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో తన పుట్టిన రోజున ప్రత్యేక కథనాలు అందించిన మీడియాకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో భావోద్వేగానికి గురైన పవర్ స్టార్..

నా బర్త్ డే రోజున ప్రత్యేక కథనాలతో

నా బర్త్ డే రోజున ప్రత్యేక కథనాలతో

నా జన్మదినం సెప్టెంబర్ 2న సినీ, మీడియా మిత్రులెందరూ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ సినిమా ఇంఛార్జీలు, విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, వెబ్ మీడియా నిర్వాహకులు, పాత్రికేయులు ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ చెప్పారు. వారందరికి మనస్పూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

నా ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసి

నా ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసి

నా పుట్టిన రోజు సందర్భంగా నా సినీ ప్రస్థానం, మైలురాళ్లను ప్రస్తావిస్తూ సాగిన వ్యాసాలు, కథనాలు, రాబోతున్న చిత్రాల వివరాలను పాఠకులకు, వీక్షకులకు తెలియజేయడం నాన్నెంతో సంతోషపరిచింది. అంతేకాకుండా నా ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసింది అంటూ పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

కష్టాల్లో జనగళంగా జనసేన

కష్టాల్లో జనగళంగా జనసేన

కష్టాల్లో ఉన్న జనం గళంగా జనసేన నిలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. సినీ రంగంలో భాగమైన మీడియా మిత్రులు.. నేను ప్రజా జీవితంలో ఉన్నా తమవాడిగా భావించి నా అభిమానులకు, సినీ ప్రియులకు కనువిందు చేశారు. నా హితైషులైన సినీ పాత్రికేయులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
 నిరాడంబరంగా పుట్టిన రోజు వేడుకలు

నిరాడంబరంగా పుట్టిన రోజు వేడుకలు

పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకోవడం, ముగ్గురు అభిమానులు ఈ లోకాన్ని వీడటం, నలుగురు అభిమానులు గాయపడటంతో పవన్ కల్యాణ్ వేడుకలకు దూరంగా ఉన్నారు. అభిమానులను కూడా నిరాడంబరంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. అయితే తన బర్త్ డేను పురుస్కరించుకొని వకీల్ సాబ్‌తోపాటు మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అభిమానులకు ఆనందాన్ని పంచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X