వెరీ ఇంట్రెస్టింగ్: పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్.. మూడు నెలలకు రూ. 200 కోట్ల సంపాదన.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రభావం చూపించే హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. అనతి కాలంలోనూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో ప్రయోగాలు చేశాడు. వాటిలో చాలా వరకు నిరాశనే మిగిల్చినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే ఎవరికీ అందని రికార్డులను సాధించాడు. అదే సమయంలో రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు. ఇక, చాలా ఏళ్ల తర్వాత అతడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ ఖాతాలో ఓ సెన్సేషనల్ రికార్డ్ వచ్చి చేరింది. ఇంతకీ ఏంటా రికార్డ్.? వివరాల్లోకి వెళితే....

అసలు చేయనని మనసు మార్చుకున్నాడు

అసలు చేయనని మనసు మార్చుకున్నాడు

రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇకపై ఎప్పుడూ నటించనని, ప్రజా సేవకే తన జీవితం అంకితం అని ఆయన పలుమార్లు స్పష్టం చేశాడు. అలాంటి బలమైన స్టాండ్ తీసుకున్న జనసేనాని.. ఉన్నట్లుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ మధ్యనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడాయన.

సూపర్ హిట్ సినిమాతో వస్తున్నాడు

సూపర్ హిట్ సినిమాతో వస్తున్నాడు

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' సినిమాకు రీమేక్‌గా వస్తున్న మూవీ ద్వారా పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ పూర్తి చేసుకున్న పవన్.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.

చిరంజీవి బాటలో నడవనున్న పవన్

చిరంజీవి బాటలో నడవనున్న పవన్

‘పింక్' రీమేక్ మొదలు అవకముందే పవన్ కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. పిరియాడిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో పవన్ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నాడు. ఇటీవల చిరు.. ‘సైరా: నరసింహారెడ్డి'లో అదే తరహా పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్‌కు పవన్ పచ్చజెండా

బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్‌కు పవన్ పచ్చజెండా

ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కల్యాణ్ మరో ప్రాజెక్టుకు కూడా పచ్చజెండా ఊపాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో ‘గబ్బర్ సింగ్' ద్వారా పవర్ స్టార్‌కు బ్రేకిచ్చిన హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారికి ప్రకటనను చిత్ర యూనిట్ శనివారమే వెల్లడించింది.
సినిమాకు 30 చొప్పున మొత్తం 90

సినిమాకు 30 చొప్పున మొత్తం 90

ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కల్యాణ్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని బహిరంగంగానే వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూడు సినిమాలకు తలో 30 చొప్పున 90 రోజుల డేట్స్ కేటాయించాడట పవన్.

పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్

పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్

అంతేకాదు, పవన్ రీఎంట్రీకి సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు సినిమాలకు గానూ పవర్ స్టార్ రూ. 200 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకోబోతున్నాడట. అది కూడా కేవలం మూడు నెలల్లోనే ఇంత మొత్తం సంపాదించనున్నాడని అంటున్నారు. దీంతో పవన్ ఖాతాలో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X