జల్సా సినిమాతో పవన్ అభిమానుల రికార్డు.. జనసేనా సేవా కార్యక్రమాలకు చేయూత

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కేవలం సినిమాలతో హడావిడి చేయడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కోసం వారు చేయుతను అందిస్తున్నారు అని మరోసారి రుజువు చేశారు. కొన్ని వారాల క్రితం థియేటర్లలో మళ్ళీ విడుదలైన జల్సా సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక చాలా కాలం తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ అందుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్నిటిని కూడా జనసైనికులు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా అందజేశారు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు.

Pawan kalyan janasena followers donation jalsa collections to janasena Charity

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను థియేటర్లలో ప్రదర్శించగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది అయితే 'నా సేన కోసం నా వంతు' అనే కార్యక్రమానికి.. ఆ వచ్చిన కలెక్షన్స్ అన్నిటినీ కూడా అందజేయడం జరిగింది. జన సైనికులు సాయి రాజేష్, సతీష్, ధర్మేంద్ర కోటి రూపాయలను చెక్ రూపంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి చేతుల మీదుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.

చలనచిత్ర ప్రత్యేక ప్రదర్శనలకు కీలక పాత్ర పోషించిన వారిలో ఉమా నాగేంద్ర శ్రీధర్ కూడా ఉన్నారు. ఇక అభిమానం ఫోటో కోసం ఆగకుండా కోటి రూపాయల విరాళం సేకరించే స్థాయికి ఎదిగినది అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు గారు తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జనసేన అభిమానులు చూపించిన కృషికి ఎంతగానో సంతోషపడ్డారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ స్థాయిలో అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రజా సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇటీవల నరేంద్ర మోడీని కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలుసుకోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X