రిస్క్ చేయనంటున్న పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ స్టోరీ రిజెక్ట్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ లో రాజకీయ చర్చలతో పాటు తన సినిమాల విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే రెండు సినిమాలను పూర్తి చేయాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల పవన్ కి సమయం చాలానే వృధా అయ్యింది. అందుకే తక్కువ సమయంలో మంచి సినిమాలను చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇటీవల పవన్ రీమేక్ చేయాలనుకున్న ఒక కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Pawan Kalyan Key Decision On Malayalam Movie Remake
రాజకీయాల్లో..

రాజకీయాల్లో..

పవన్ కళ్యాణ్ కి గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఆంద్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. వీలైనంత వరకు సమస్యలపై పొరాడకపోతే పార్టీ మనుగడను కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకే పవన్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఎదో ఒక విధంగా స్పందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సినిమాల గురించి రోజుకు ఒకసారైనా ఆలోచిస్తున్నారట.

బిజీ షెడ్యూల్..

బిజీ షెడ్యూల్..

ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేయక తప్పదు. అందుకే వకీల్ సాబ్ ని వెంటనే పూర్తి చేసి మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాలని అనుకున్నాడు. వకీల్ సాబ్ పనులు ఇంకా అయిపోలేదు. ఇక క్రిష్ విరుపాక్ష కొత్త షెడ్యూల్ సెట్ చేసుకునే పనిలో బిజిగా ఉన్నాడు. ఆ తరువాత హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు.

మలయాళం రీమేక్..

మలయాళం రీమేక్..

అసలు మ్యాటట్ లోకి వస్తే.. పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక మలయాళం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వచ్చింది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాను తెలుగులో నిర్మించడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వద్దకు ఆ ఆఫర్ రాగా.. సినిమాపై ఒక లుక్కేసినట్లు తెలుస్తోంది.

రిస్క్ చేయలేనని..

రిస్క్ చేయలేనని..

ఒక సాధారణ అభిమానికి ఒక స్టార్ హీరోకు మధ్య జరిగే వివాదం చుట్టూ డ్రైవింగ్ లైసెన్స్ కథ తిరుగుతుంది. మలయాళంలో ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అయితే ఆ కథ తనకు ఎంత మాత్రం సెట్టవ్వదని రిస్క్ చేయలేను అని పవన్ నిర్మాతలకు చెప్పాడట. దీంతో ఆ నిర్మాతలు మరొక కొత్త కథను సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X