ఐరన్‌మ్యాన్, థోర్ రేంజ్‌లో పవన్, క్రిష్ మూవీ.. హాట్ టాపిక్‌గా పవర్‌స్టార్ రెమ్యునరేషన్

రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్లీ అభిమానులులో జోష్ పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏకధాటిగా 5 సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. పింక్ రీమేక్‌లో నటిస్తున్న పవన్ కల్యాణ్.. అదే సమయంలో దర్శకుడు క్రిష్ రూపొందించే సినిమా కోసం శారీరకంగాను, మానసికంగాను సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

ఆర్థిక సమస్యల నుంచి

ఆర్థిక సమస్యల నుంచి

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం స్వయంగా పవర్‌స్టార్ పలు సందర్బాల్లో వెల్లడిస్తున్నారు. కేవలం తన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకే పవన్ సినిమాలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఒక్కో సినిమా కోసం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు సమాచారం.

విరూపాక్షగా పవన్ కల్యాణ్

విరూపాక్షగా పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా పేరు విరూపాక్షగా ప్రచారం అవుతున్నది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ సినిమాను అవెంజర్స్, థోర్, ఐరన్ మ్యాన్ తరహాలో భారతీయ నేటివిటికి తగినట్టుగా ఓ చారిత్రాత్మక నేపథ్యంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

మార్వెల్ సినిమా తరహాలో

మార్వెల్ సినిమా తరహాలో

విరూపాక్ష చిత్రంలో ఉండే మార్వెల్ తరహా పాత్ర కోసం పవన్ కల్యాణ్ దేహధారుడ్యాన్ని పటిష్టం చేసుకొంటున్నారని, ఆ మేరకు బరువు తగ్గి ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో చెమటోడ్చుతున్నారని తెలిసింది. ఓ పక్క పాలిటిక్స్‌ను బ్యాలెన్స్ చేస్తూనే.. మరోపక్క సినిమాలపై దృష్టిపెడుతూ ముందుకెళ్తున్నట్టు సమాచారం.

200 కోట్లతో మూవీ

200 కోట్లతో మూవీ

ఇక విరూపక్ష చిత్రం పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందే సినిమాగా తెరకెక్కనున్నదనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. PSPK27 మూవీని నిర్మాత ఏఎం రత్నం సుమారు రూ.200 కోట్లతో పిరియాడిక్ యాక్షన్‌గా రూపొందిస్తున్నట్టు తెలిసిందే. ఈ చిత్రం మొగల్ సామ్రాజ్యం కథా నేపథ్యంగా సాగుతుందనే వార్త హల్‌చల్ చేస్తున్నట్టు సమాచారం.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
వకీల్ సాబ్‌గా పవర్ స్టార్

వకీల్ సాబ్‌గా పవర్ స్టార్

ప్రస్తుతం పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X