Pawan kalyan: ఆ సినిమా కోసం ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన పవర్ స్టార్.. లేటెస్ట్ ఫోటో వైరల్!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో రెగ్యులర్గా కనిపిస్తూనే మరొకవైపు లైన్ అప్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తున్నాడు. భారీ స్థాయిలో మార్కెట్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగు వేశాడు. ఇక ఆ దారిలో ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే.
అయితే సినిమాలు పాలిటిక్స్ కారణంగా పవన్ ఫిట్నెస్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. నిత్యం పార్టీలో కార్యకర్తలతో ఏదో ఒక విషయంపై చర్చలు జరుపుతూనే ఉండాలి అంతేకాకుండా షూటింగ్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. దీంతో పవన్ కళ్యాణ్ కు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టే సమయం పెద్దగా దొరకలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా కోసం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ సునామి సృష్టించిన పవన్ కల్యాణ్ తదుపరి సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఇక అందరి ఫోకస్ అయితే ఎక్కువగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా పైనే ఉంది. పిరియాడిక్ హిస్టోరికల్ ఫిలిమ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించబోతున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో.. పవన్ కళ్యాణ్ ఉన్న వాడి నుంచి దోచుకుని లేనివాడికి ఇచ్చే ఒక గజదొంగ పాత్రలోనే కనిపించబోతున్నట్లు ఆ మధ్యకాలంలో ఒక టాక్ వినిపించింది.

మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో పవన్ కళ్యాణ్ అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాలను ఏ విధంగా తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక హరిహర వీరమల్లు సినిమాను కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొన్ని ఎపిసోడ్స్ లో కొంచెం ఫిట్నెస్ గా కనిపించాలని దర్శకుడు చెప్పడంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ జిమ్ లోకి అడుగుపెట్టి వర్కౌట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కు వ్యాయామాల పై ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తలుచుకుంటే పవన్ కళ్యాణ్ చాలా తొందరగానే తన బరువును తగ్గించుకోగలడు. ఇక హరిహర వీరమల్ల సినిమాలో మాత్రం కాస్త ఫిట్నెస్తో కనిపించాలి అని చెప్పడంతో మరీ ఎక్కువగా తగ్గకుండా అలాగని మరీ లావుగా ఉండకుండా మీడియం రేంజ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. అసలైతే ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది దసరా సమయానికి విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











