పవన్ కల్యాణ్ కొత్త లుక్ అదిరిందిగా.. ఏ సినిమా షూటింగ్ మొదలంటే?
దాదాపు ఏ సినీ రంగంలో అయినా కూడా ఓ స్టార్ హీరో తన పీక్ స్టేజి ని వదులుకొని రాజకీయాల్లోకి రావాలి అని అనుకోడు. కానీ ఒక్క హీరో మాత్రం తనకు సినిమా కంటే సమాజం ఎక్కువ అనుకోని తన పీక్ కెరీర్ స్టేజి లో నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టేసాడు. అతడు ఎవరో ఈపాటికే అర్ధం అయ్యిపోయి ఉంటుంది. యెస్ అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
టాలీవుడ్ లో అప్పటివరకు పదేళ్ల పాటుగా సరైన హిట్ లేదు. సరే గబ్బర్ సింగ్ అనే హిట్ వచ్చింది. వెంటనే కాంట్రవర్సీతో కూడా "కెమెరా మెన్ గంగతో రాంబాబు" అనే సినిమాతో అప్పట్లోనే డే 1 కి 20 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఛరిష్మా పవన్ సొంతం. ఆ వెంటనే "అత్తారింటికి దారేది" సృష్టించిన సంచలనం అయితే అంతా ఇంతా కాదు.

ఇలాంటి పీక్ స్టేజిలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసాడు. అయితే రాజకీయాల్లో కూడా ఇదే పదేళ్లు పవర్ లేదు ఈ డబ్బకు సినిమాల్లో కూడా అనే బిరుదు వద్దు అని తీయించేసాడు. అయితే పవన్ తో సినిమాలు అంటే నిర్మాతల్లో తప్పకుండా ఒక టెన్షన్ ఉంటుంది. పవన్ దృష్టి పెడితే ఎంత త్వరగా పూర్తి చేసేస్తాడో తెలుసు.
దీనికి "బ్రో ది అవతార్" ఒక చక్కటి ఉదాహరణ. కాగా ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కోరుకున్న విజయం, పవర్ రెండూ దక్కాయి. సో మళ్ళీ తాను మధ్యలో ఆపిన సినిమా తిరిగి పునః ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా లాంగ్ హెయిర్ ఎక్కువ గడ్డంతో దర్శనం ఇచ్చిన పవన్ నిన్న ఉప ముఖ్యమంత్రి హోదాలో బయటకి వచ్చిన లుక్ మాత్రం కొత్తగా కనిపించింది.

హెయిర్ కి కటింగ్, గడ్డానికి ట్రిమ్మింగ్ ఆల్మోస్ట్ "ఓజి" లుక్ లోకి పవన్ కళ్యాణ్ మారాడు. దీంతో పవన్ మళ్ళీ సినిమాలకి సిద్ధం అయినట్టుగా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న "ఓజి" సినిమా వచ్చే ఏడాదికి అనధికారికంగా వాయిదా పడిపోయింది.
ఈ ఏడాదిలో మరో పాన్ ఇండియా చిత్రం "హరిహర వీరమల్లు" రానుంది. మరి ఈ రెండిట్లో పవన్ ఏ సినిమా మొదలు పెట్టనున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే పవన్ కి పర్శనల్ గా ఓజి పై ప్రత్యేక దృష్టి ఉంది అని ఫ్యాన్స్ కి కూడా తెలుసు. ఆ సినిమాకి పవన్ ఇంకా ఇవ్వాల్సింది సుమారు 15 రోజులు మాత్రమే అన్నట్టుగా టాక్.

సో ఈ లుక్ లో అయితే పవన్ ఓజి కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకోపక్క మొన్ననే సంగీత దర్శకుడు థమన్ కూడా మళ్ళీ పనులు రీస్టార్ట్ చేసాడు. సో అన్ని వేళ్ళు 'ఓజి' వైపే చూపిస్తున్నాయి. మరి చూడాలి రియల్ పవర్ స్టార్ ఇప్పుడు ఏ సినిమాతో మొదలు పెడతాడు అనేది..


Click it and Unblock the Notifications











