పవన్ న్యూ స్టైలిష్ లుక్ వైరల్.. చాలా కాలం తరువాత ఇలా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం అనంతరం విభిన్నమైన సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలు. తీరిక లేకుండా బిజీ అవుతున్న పవన్ ను రాబోయే సినిమాలలో మాత్రం నెవర్ బోఫోర్ అనేలా దర్శనమివ్వనున్నాడు. ఆ సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ముందుగా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఒకే రోజు రెండు సినిమాలు

ఒకే రోజు రెండు సినిమాలు

పింక్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఇక పవన్ మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల షూటింగ్స్ ను పవన్ ఒకే రోజు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 27వ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో ఒక స్పెషల్ సెట్ వేయగా అందులో దర్శకుడు క్రిష్ కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొకటి

ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొకటి

ఇక మరోవైపు హైదరాబాద్ లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా అందులో కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. ఉదయం క్రిష్ సినిమా మధ్యాహ్నం తరువాత AK రీమేక్ కోసం వెళుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రెగ్యులర్ పాలిటిక్స్ ను కూడా ఏ మాత్రం మరచిపోవడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు.

జిమ్ లో కసరత్తులు

జిమ్ లో కసరత్తులు

ఇక ఫిట్నెస్ లో కూడా పవన్ చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పవన్ తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఇలాంటి రోల్స్ చేయలేదు. అందుకే కొత్తగా ఉండాలని చాలా గ్యాప్ తరువాత స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. పవన్ ఇన్నాళ్లు రెగ్యులర్ వ్యాయామలతోనే ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు.

న్యూ లుక్ వైరల్

న్యూ లుక్ వైరల్

ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో లీక్ అయ్యింది. అందులో పవన్ కళ్యాణ్ మునుపెన్నడు కనిపించనంత స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. బ్లాక్ టీ షర్ట్ లో ఒక సైడ్ వ్యూవ్ లో స్మైల్ తోనే అదరగొట్టేసాడు. చూస్తుంటే పవన్ మరోసారి బాక్సాఫీస్ హిట్స్ ను బ్లాస్ట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇక క్రిష్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా కనిపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వర్కౌట్స్ చేసిన ఫొటోలను లీక్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇక క్రిష్ సినిమాకు సంబంధించిన టైటిల్స్ పై రకరకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. విరూపాక్ష, శివం, గజదొంగ, హర హర మహాదేవ్, బందిపోటు వంటి పేర్లు వినిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X