పవన్ కల్యాణ్ అందుకు రెడీ అవుతున్నాడా? గడ్డం అందుకే తీశారా? కూతురుతో కలిసి

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో కొత్తగా చెప్పనక్కర్లేదు. గత రెండేళ్లకుపైగా టాలీవుడ్‌కు దూరమై జనసేన పార్టీ కోసం ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాడు. గత అసెంబ్లీ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేశాడు. ఆ క్రమంలోనే భారీగా గడ్డం, జుట్టు పెంచి రుషి అవతారం ఎత్తాడు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ రెగ్యులర్ లుక్‌లోకి మారిపోయాడు. దాంతో పవర్ స్టార్‌పై మళ్లీ రూమర్లు జోరందుకొన్నాయి. గడ్డం తీయడం వెనుక అసలు కథేమిటంటే..

కూతురుతో కలిసి కొత్త లుక్

కూతురుతో కలిసి కొత్త లుక్

పవన్ కల్యాణ్‌కు సంబంధించిన తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రఫ్‌గా కొంచెం గడ్డంతో కనిపిస్తూ తన కూతురు స్కూల్ డ్రస్‌లో ఉండగా ఫొటో దిగాడు. ఆ ఫొటో ఇప్పుడు మీడియాలో క్రేజీగా మారింది. ఇక ఆ ఫోటో గురించి వివరాలు పక్కన పెట్టి అసలు మ్యాటర్‌లోకి వస్తే.. పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం జోరుగా జరుగుతున్నది.

పాలిటిక్సా? సినిమాలా? సందేహాలు

పాలిటిక్సా? సినిమాలా? సందేహాలు

రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్‌కు గట్టిగానే చేదు అనుభవం ఎదురైంది. తన అభిమానులు రాజకీయాల్లో కూడా సపోర్ట్ చేస్తారనుకొంటే వాళ్లు చేతులెత్తేయడం షాక్ తగిలింది. ఇప్పుడు పవన్ పాలిటిక్స్‌కే పరిమితం అవుతాడా లేక రెండు పడవ మీద కాలు పెట్టి వచ్చే ఎన్నికల వరకు సినిమాలు, రాజకీయాలు చేస్తారా అనే విషయం అంతుపట్టకుండా ఉంది.

రెండు సినిమాలకు కమిట్‌మెంట్‌తో

రెండు సినిమాలకు కమిట్‌మెంట్‌తో

వాస్తవానికి పవన్ ఇప్పటికే రెండు, మూడు సినిమాలు కమిట్ అయ్యారనేది సినీవర్గాల టాక్. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమా, ఏఎం రత్నం కోసం మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాల కోసం అడ్వాన్సు రూపంలో కొంత మొత్తం తీసుకొన్నారనే ఎప్పటి నుంచో వార్తలు మీడియాలో విహారం చేస్తున్నాయి. ఆ రెండు సినిమాల కోసం పవన్ తన నిర్ణయాన్ని మార్చుకొంటాడా అనేది వేచి చూడాల్సిందే.

 తానాకు పవన్ కల్యాణ్

తానాకు పవన్ కల్యాణ్

ఇక పవన్ కల్యాణ్ గెడ్డం తీయడం వెనుక మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభలకు పవన్ కల్యాణ్ హారుకానున్నారట. ఈ సభలకు రెగ్యులర్ లుక్‌లో హాజరుకావాలని నిర్వాహకులు రిక్వెస్ట్ చేశారట. అంతేకాకుండా పవన్‌ను గెడ్డం తీయాలని ఫ్యాన్స్ నుంచి కూడా ఒత్తిడి పెరిగిందట. అన్ని రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకొని గడ్డం తీసి రెగ్యులర్ లుక్‌లోకి వచ్చారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X