Akira: అకీరా నందన్ సినీ ఎంట్రీ.. కొడుకు కెరీర్‌పై పవన్ కల్యాణ్ క్లియర్ కట్ క్లారిటీ!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై ఈ మధ్య ఊహాగానాలు, చర్చ భారీగానే జరుగుతున్నది. గతంలో తల్లి రేణుదేశాయ్ తన కుమారుడి అకీరాకు నటించడంపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో పవర్ స్టార్, మెగా అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అయినప్పటికీ అకీరా సినీ ఎంట్రీ గురించి ఎప్పుడూ ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తుంటాయి. తాజాగా పవన్ పుత్రుడి సినీ రంగ ప్రవేశంపై మరోసారి భారీ చర్చకు తావిచ్చేలా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కారణమయ్యాయి. అకీరా ఎంట్రీ గురించి పవన్ కల్యాణ్ అభిప్రాయం ఏమిటంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19వ తేదీన అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌ను రాశీ సింగ్, హరీష్ శంకర్ భుజానికి ఎత్తుకొన్నారు. పవన్ కల్యాణ్ తన విధి నిర్వాహణల్లో బిజీగా ఉండటంతో ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ రానున్నారనే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు పవన్ కల్యాణ్ గారితో అకీరా ఎంట్రీ గురించి ప్రస్తావిస్తే.. దానికి ఆయన మౌనమే సమాధానం అయింది. మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నా.. వాటిని బయటకు చెప్పలేక దాట వేసే ప్రయత్నం చేశారు. కానీ అకీరాకు ఏం ఇష్టమో.. అతడే చెప్పాలి. అతడి నుంచే తన ఇష్టాలు బయటకు వస్తే.. మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం. అతడికి ఇష్టం లేని విషయాలను మనం చేయకూడదు అనే విధంగా మాట్లాడారని హరీష్ శంకర్ తెలిపారు.
పవన్ కల్యాణ్ నాతో మాట్లాడుతూ.. అకీరాకు తాను ఏం చేయాలనుకొంటున్నాడో అది తనే డిసైడ్ చేసుకోనివ్వండి. తనకు యాక్టింగ్ ఇష్టమా? మ్యూజిక్ ఇష్టమా? లేదా ఇంకా ఏదైనా ఫీల్డ్ ఇష్టమా? అనేది తనే చెప్పాలి. మా ఫ్యామిలీ లెగసీ ప్రభావం, అభిమానులు అంచనాలు, ఒత్తిడి అకీరాపై ఉండకూడదు అనే అభిప్రాయాన్ని పవర్ స్టార్ వెల్లడించారు.
అయితే పవన్ కల్యాణ్ అభిప్రాయాలను హరీష్ శంకర్ వెల్లడించిన తర్వాత అకీరా నందన్ సినిమా ఎంట్రీపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ, తండ్రి బాటను అనుసరించి అకీరా యాక్టింగ్‌పై దృష్టిపెట్టాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తున్నది. ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











