Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ సినిమా కోసం మొదటిసారి భారీ బడ్జెట్.. నెవర్ బిఫోర్ అనేలా..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకోవడం కామన్. ఇక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మామూలుగా ఉండవు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ 27వ సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా బడ్జెట్ ఎంత పెడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయంపై ఒక లుక్కేస్తే..
కంటెంట్ క్లిక్కయితే..
పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తం చూసుకుంటే అందులో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే పవన్ సినిమాల మార్కెట్ ఏమిటనేది నిర్మాతలకు బాగా తెలుసు. యవరేజ్ టాక్ వచ్చినా కూడా పవన్ సినిమాతో భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకోవచ్చని అనుకుంటారు. కంటెంట్ క్లిక్కయితే మరో బోనస్ అనే చెప్పాలి. ఇక 27వ సినిమా విషయంలో బోనస్ కూడా వచ్చేలా ఉన్నట్లు టాక్ వస్తోంది.
మొదటిసారి హిస్టారికల్ కథలో..
ఇంతవరకు పవన్ కళ్యాణ్ ను ఒక పిరియాడిక్ డ్రామాతో చూడలేదు. అంతటి క్రేజ్ ఉన్న స్టార్ హీరో మొదటిసారి హిస్టారికల్ కథను టచ్ చేస్తుండడంతో అందరిలో రోజురోజుకు అంచనాలు మరింత ఎక్కువవుతున్నాయి. గౌతమి పుత్ర శతకర్ణి అనంతరం దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న బిగ్గెట్ పాన్ ఇండియా మూవీ ఇది. హరిహర వీరమల్లు ఫస్ట్ టీజర్ నిన్న శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
మొదట 70కోట్లనుకుంటే..
ఇక పవన్ ఇంతవరకు పాన్ ఇండియా కాన్సెప్ట్ లను టచ్ చేసింది లేదు. కానీ నార్త్ లో పవన్ కు అభిమానులు చాలా మంది ఉన్నారు. హరహర వీరమల్లు సినిమాను సూర్య మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమా 70కోట్లతో కేవలం తెలుగు తమిళ్ లోనే ద్విభాషా చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారట.
మొత్తం బడ్జెట్ ఎంతంటే..
అయితే కథలో యూనివర్సల్ పాయింట్స్ ఎక్కువగా ఉండడంతో దర్శక నిర్మాతలు మళ్ళీ దాన్ని పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకొచ్చారు. ఇక మొత్తం బడ్జెట్ 150కోట్లకు పైనే అవుతోందని టాక్ వస్తోంది. తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మరి సినిమా అంచనాలకు తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవుతుందో లేదో చూడాలి. సినిమాను సంక్రాంతికి.ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.