Pawan Kalyan: హరిహర వీరమల్లు సెట్స్ లో పవన్ కల్యాణ్.. ఆ గెటప్పుకు, నవ్వుకు ఫిదా, ఫొటోలు వైరల్!
ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి తెరగేంట్రం చేసిన పవన్ కల్యాణ్.. తనదైన శైలీలో నటిస్తూ అశేషమైన అభిమానగనానన్ని సంపాదించుకుని ప్రత్యేకమైన స్టార్ డమ్ సాధించుకున్నాడు. అంచెలంచలుగా ఎదిగి టాలీవుడ్‌లో పవర్ స్టార్ అనే బ్రాండ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన నుంచి సినిమాలు, వచ్చిన, పోస్టర్లు విడుదలైన సోషల్ మీడియా షేక్ అవుతుంది. పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పుడు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించిన పవన్ కల్యాణ్ కొత్త గెటప్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

డిజిటల్ తెరపై అలరించిన..
తెలుగు ప్రజల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్ కల్యాణ్ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయే పవన్ కల్యాణ్ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. ఇటీవల పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతోపాటు డిజిటల్ తెరపై కూడా అలరించాడు పవన్ కల్యాణ్.

భారీ బడ్జెట్ తో..
నందమూరి నటసింహం అన్ స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ లో హుందాగా ఉంటూ అలరించారు పవన్ కల్యాణ్. అలాగే తెలంగాణలో పుణ్య క్షేత్రమైన కొండగట్టులో తన ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించి పాలిటిక్స్ లో మరింత చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మేజర్ యాక్షన్ సీన్స్ పూర్తి..
పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ (దాదాపుగా రూ. 15 కోట్లు)తో పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రీకరణ ఇప్పటికే 60 శాతానికిపైగా పూర్తయింది. ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో హరిహర వీరమల్లు చిత్రీకరణ జరుపుకుంది. అందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసినట్లు ఫైట్ మాస్టర్ విజయ్ సోషల్ మీడియాలో కూడా తెలిపిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో వైరల్..
ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ కానున్నట్లు సమాచారం. బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. అయితే నేడు అంటే ఫిబ్రవరి 4న ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ హరిహర వీరమల్లు సెట్స్ పై తీసిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది చిత్రబృందం. వాటిని పవన్ కల్యాణ్ సైతం అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ గెటప్, నవ్వుకు ఫిదా..
పవన్ కల్యాణ్ షేర్ చేసిన ఆ ఫొటోల్లో ఆయన గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అందులో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కనిపించిన పవన్ కల్యాణ్ నవ్వుతూ దర్శనమిచ్చారు. పవన్ కల్యాణ్ నవ్వుకి మెగా ఫ్యానస్ ఫిదా అయిపోతున్నారు. అలాగే ఇందులో పవన్ గెటప్ వజ్రాల దొంగలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్.. త్వరగా సినిమా అప్డేట్స్ ఇవ్వండి అని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











