పవన్ కల్యాణ్‌కు ఎదురుదెబ్బ.. రెండేళ్ల ప్లాన్స్ చెల్లాచెదురు.. ఇలా అయితే కష్టమే!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు జోష్ ఇచ్చినా.. రాజకీయ వర్గాలకు ఓ అస్త్రంగా మారింది. ఆర్థిక పరిస్థితులు చక్కపెట్టుకొనేందుకు తాను సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఎన్నికల వరకు కుటుంబాన్ని, పార్టీని పోషించుకోవడానికి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. కానీ పవన్ వేసుకొన్న స్కెచ్‌కు భిన్నంగా ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అనుకోకుండా లాక్‌డౌన్ రావడంతో తన ప్లాన్స్ చెల్లా చెదురు అయ్యాయనే మాట వినిపిస్తున్నది. పవన్ ప్లాన్స్ ఎలా చెల్లాచెదురు అయ్యాయంటే..
Recommended Video

ముందస్తు ఒప్పందాలు కారణంగా
క్రీయాశీలక రాజకీయాల్లోకి వెళ్లక ముందు పవన్ పలు నిర్మాతలకు సినిమాలు చేస్తాననే ఒప్పందంతో అడ్వాన్సులు పుచ్చుకొన్నారు. అయితే ఎన్నికలు రావడం, ఆ తర్వాత జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. అప్పట్లో ఇచ్చిన మాట మేరకు మూడు సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయడమే కాకుండా తాను ఆర్థికంగా నిలబడేందుకు మరొకొన్ని సినిమాలు చేయాలని భావించారు.

వకీల్ సాబ్ మూవీలో అలా
అలా ప్లాన్‌లో లేని సినిమానే వకీల్ సాబ్. పింక్ రీమేక్‌గా తమిళంలో విజయం సాధించడంతో తెలుగులో రూపొందించడానికి ప్రముఖ నిర్మాతలు బోనికపూర్, దిల్ రాజు చేతులు కలిపారు. సినిమా అంతా సవ్యంగా సాగిపోతుండటం, 90 శాతం షూటింగ్ పూర్తి కావడంతో అంతా అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందని భావించారు. కానీ కరోనావైరస్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో పవన్ చేయాల్సిన మరో సినిమాపై ప్రభావం పడిందనే వార్తలు వస్తున్నాయి.

క్రిష్ ప్రాజెక్టుకు కరోనా అడ్డుకట్ట
ఇక కరోనా లాక్‌డౌన్ పరిస్థితులు లేకపోతే పవన్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న విరూపాక్ష (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రారంభం కావాల్సింది. క్రిష్ సినిమా అలా ఆలస్యం కావడంతో మరికొన్ని సినిమాలు చేయడానికి పవన్ వేసుకొన్న ప్లాన్ ఇప్పుడు చెల్లాచెదురైందనే మాట వినిపిస్తున్నది. రానున్న రెండేళ్లలో పవన్ నాలుగు లేదా ఐదు సినిమాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకోవడం.. ఆ ప్లాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవుతుందా అనే ప్రశ్న వెంటాడుతున్నది.

పవన్ డైరీలో విలువైన కాలం
ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్లాన్‌లో ఎలాంటి పురోగతి లేకుండా రెండు నెలలు గడిచిపోయాయి. పవన్ డైరీలో విలువైన కాలం ఎలాంటి ఫలితాలు లేకుండానే గడిచిపోయాయి. మరో రెండు నెలలు కూడా ఎలాంటి డెవలప్‌మెంట్స్ లేకుండానే గడిచిపోయే పరిస్థితి ఉంది. ఇలా కరొనా లాక్‌డౌన్ పరిస్థితులు పవన్ ఫైనాన్సియల్ ఫ్లాన్స్‌ను గట్టిగానే దెబ్బ దీశాయనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో పవన్ తన షెడ్యూల్స్‌ను ఎలా పూర్తి చేసి తన ప్లాన్స్ సక్సెస్ చేస్తారో వేచి చూడాల్సిందే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు
పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. క్రిష్ దర్శకత్వంలో రానున్న పిరియాడిక్ డ్రామా సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇక మరో రెండు సినిమాలపై కసరత్తు జరుగుతున్నది. ఒకటి హరీష్ శంకర్ సినిమా కాగా, మరోది కిషోర్ పార్దసాని (డాలీ) ప్రాజెక్టులు ఖరారు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











