20 ఏళ్ల తర్వాత అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్.. హరిహరవీరమల్లు కోసం పవర్‌ఫుల్ అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా బిజీగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పిల్లలతో త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన గతంలో ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయంపై పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఫోటోతో ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా తన పొలిటికల్ కు సంబంధించిన అంశాలపై కూడా పవన్ ప్రత్యర్థులకు చురకలు అంటిస్తున్నాడు. ఆ వివరాల లోకి వెళితే..

పాన్ ఇండియా ప్రాజెక్ట్

పాన్ ఇండియా ప్రాజెక్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు అనే సినిమాను చేస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో అతను ఒక సమరయోధుడి తరహాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ కూడా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు.

గ్యాప్ ఇవ్వకుండా..

గ్యాప్ ఇవ్వకుండా..

మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కొంత బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు అని కూడా టాక్ వచ్చింది. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ ఇతర పనులతో బిజీగా ఉండడం వల్లనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ఇక ఇప్పుడైతే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడు.

మార్షల్ ఆర్ట్స్

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా హైలెట్ కాబోతున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో ప్రత్యేకమైన ఫోటో పోస్ట్ చేస్తూ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు.

20 ఏళ్ల తర్వాత అంటూ..

20 ఏళ్ల తర్వాత అంటూ..

దాదాపు 20 ఏళ్ల తర్వాత తనకు ఎంతో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ ను మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఆయన వివరణ ఇస్తూ అదిరిపోయే ఫోటో పోస్ట్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్ చిన్న కత్తితో ఇచ్చిన ఒక స్టిల్ అయితే మామూలుగా లేదు. ఫ్యాన్స్ ఎలాగైతే పవన్ కళ్యాణ్ ను చూడాలనుకుంటున్నారో అదే తరహా స్టిల్ లో అతను కనిపించడం వైరల్ గా మారుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఫోటో పై చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

పవన్ కౌంటర్

అలాగే మరొక పోస్టులో పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టమైన చొక్కా ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి వ్యాన్ గురించి ప్రత్యర్థి రాజకీయ నాయకులు అనవసరమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దానికి కౌంటర్ గా కనీసం ఇలాంటి చొక్కా వేసుకునేందుకు నేను అర్హుడినా కాదా అని కౌంటర్ అయితే ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఫోకస్ చేస్తున్నట్లుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X