ఊసరవెల్లి రాజకీయాల కామెంట్స్ తరువాత.. మొదటిసారి ఎదురుపడనున్న పవన్, ప్రకాష్ రాజ్
రాజకీయాలలో ఎలాంటి వారైనా సరే విమర్శలు ఎదుర్కోవడం సర్వసాధారణం. అయితే ఎప్పుడైనా సరే సమయం చూసి విమర్శలపై స్పందించాలి అంటుంటారు రాజకీయ నిపుణులు. ఇక ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని పోలీటికల్ కామెంట్స్ పై కూడా పవన్ కూడా అలానే ఆలోచిస్తున్నాడో ఏమో తెలియదు గాని చాలా వరకు విమర్శలకు ఆయన లేటుగా సమాధానం ఇచ్చినా కూడా కౌంటర్ ఇచ్చేలానే స్పందిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ విమర్శల అనంతరం మొదటిసారి పవన్ కళ్యాణ్ కు ఎదురుగా వాధించబోతున్నారు.

ఆర్థిక బలం కోసం సినిమాలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజకీయాల్లో తనదైన శైలిలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉంటున్నాడు. ఈ ప్రయాణం కష్టమని తెలిసినప్పటికీ రానున్న రోజుల్లో పార్టీని నడపాలి అంటే ఆదాయం తప్పనిసరి. అలాగే పవన్ ఇదివరకే నిర్మతల నుంచి అలాగే సన్నిహితుల నుంచి డబ్బును తీసుకొని పార్టీ కోసం ఖర్చు చేశాడు. ఇక నిత్యం విరాళాలకు రెడీగా ఉండే పవన్.. సినిమాలతో మళ్ళీ కొంత ఆదాయాన్ని కూడబెట్టుకోవలని డిసైడ్ అయ్యాడు.

ఊసరవెల్లి రాజకీయాలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్
ఇటీవల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్.. పవన్ సడన్ గా బిజెపికి మద్దతు తెలపడంతో అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వి ఊసరవెల్లి రాజకీయాలు అంటూ కామెంట్స్ చేయడంతో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.

విమర్శల తరువాత.. కలవబోతున్నారు
అయితే పవన్ పై కామెంట్స్ చేసిన తరువాత మొదటిసారి అనుకోని విధంగా ఎదురుపడబోతున్నాడు ప్రకాష్ రాజ్. పవన్ నటిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. పవన్ పాల్గోననున్న ఆ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ కూడా జాయిన్ కానున్నాడు. ఇంతవరకు ప్రకాష్ రాజ్ ఈ సినిమా షెడ్యూల్ పాల్గొనలేదట.

ఇద్దరు వాధించబోతున్నారు
ఇక అమ్మాయిల కోసం వాదించే న్యాయవాదిగా పవన్ కనిపించనున్నాడు. ఇక విలన్స్ కు సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ మరొక లాయర్ గా వాదించబోతున్నాడు. పొలిటికల్ కామెంట్స్ తరువాత ఇద్దరు కూడా అనుకోకుండా ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. పవన్ అయితే రాజకీయాలను సినిమాలను ఏ మాత్రం కలపడని చెప్పవచ్చు. సినిమాలో నటుడిగానే ప్రకాష్ రాజ్ ను పలకరిస్తారని తెలుస్తోంది.
Recommended Video

పవన్ పై గతంలో పాజిటివ్ కామెంట్స్
ఇక మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా గతంలో పవన్ పై చాలా సార్లు పాజిటీవ్ గా కామెంట్స్ చేశారు. పవన్ వ్యక్తిగతంగా చాలా ఇష్టమని అతని మంచి తనం గురించి కూడా బాగా తెలుసని వివరణ ఇచ్చారు. ఇక పొలిటికల్ కామెంట్స్ తరువాత ఆ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సుస్వాగతం, బద్రి, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications