భీకర పోరుకు సిద్దమైన పవన్ కళ్యాణ్ - రానా.. డేట్ ఫిక్స్!
పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మొదటిసారి కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఈ సినిమా తెలుగులో అయితే బాహుబలి కంటే తక్కువేమి కాదు. రానా నెగిటివ్ షేడ్స్ తో అదరగొట్టేయగలడు. ఇక పవన్ కళ్యాణ్ హీరోయిజం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
దానికి తోడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు సాగర్ చంద్ర సినిమాకు న్యాయం చేయగలడని త్రివిక్రమ్ అయితే గట్టిగానే నమ్మాడు. దీంతో అభిమానుల్లో కూడా అంచనాల డోస్ పెరిగింది. ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక త్వరలో మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

జులై 11న అల్యూమినియం ఫ్యాక్టరీలో రానా - పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట. దాదాపు సగానికి పైగా షూటింగ్ పనులైతే అయిపోయాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది దసరా సమయానికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో సంక్రాంతికి రావచ్చని టాక్ అయితే వస్తోంది. ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ ను సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











