రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు

సినిమాల్లోకి రీఎంట్రీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. మరో రెండు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. అందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మల్టీస్టారర్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఇందులో పవన్‌తో కలిసి టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నాడు. ఇద్దరు ఇగో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే పోరాటంతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రాబోతున్న 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్రను రాయలసీమకు చెందిన వ్యక్తిగా చూపించబోతున్నారట. అంటే ఇందులో పవర్ స్టార్ ఆ ప్రాంతం వాళ్లు మాట్లాడే యాసతో డైలాగులను పలకబోతున్నాడట. 'వకీల్ సాబ్' మూవీలో తెలంగాణ యాసతో మెప్పించిన ఈ మెగా హీరో.. ఈ రీమేక్‌లో మాత్రం దానికి భిన్నమైన డైలాగ్ డెలివరీతో రానున్నాడు. ఇందుకోసం ఇప్పటికే రాయలసీమకు చెందిన పుస్తకాలను కూడా తిరగేసినట్లు టాక్.

 Pawan Kalyan Rayalaseema Slang in Ayyappanum Koshiyum Remake

భారీ స్థాయిలో రాబోతున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X