హరి హర వీరమల్లు రిజల్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్.. అలా సరిచేస్తామంటూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ హరి హర వీరమ్లలు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కింది. కాగా కొన్ని ఏరియాల్లో సినిమాకు కాస్తా మిశ్రమ స్పందన లభించింది. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. హరి హర వీరమల్లు రిజల్ట్ పై ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ చిత్రం..
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు భారీ తారాగణం నటించడం విశేషం. అదే విధంగా సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. 5 ఏళ్లుగా శ్రమించిన ఈ చిత్రానికి రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలిపి 250 కోట్ల రూపాయలకు పైగా ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Pawan Kalyan Reaction on Hari Hara Veera Mallu Movie Result

హరి హర వీరమల్లు రిజల్ట్ పై పవన్ రియాక్షన్..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కెరీర్ లోనే ఏ సినిమాకు చేయనంత ప్రచారం హరి హర వీరమల్లు చిత్రానికి అందించారు. ఇక తొలిసారిగా ఈ సినిమా సక్సెస్ మీట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొంత మిశ్రమ స్పందనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి తమ దృష్టికి వచ్చిన లోటు పాట్లను హరి హర వీరమల్లు : పార్ట్ 2లో పూర్తిగా సరిచేసుకుంటామని హామీనిచ్చారు.

హరి హర వీరమల్లుపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్..
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లముడి మొదట ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ప్రాజెక్ట్ డిలే అవ్వడం కారణం ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. మొత్తానికి సినిమాను పూర్తి చేసి జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గ టెక్నీకల్ అంశాలు, వీఎఫ్ఎక్స్, కథను నడిపించిన తీరు పెద్ద ఆకట్టుకోలేదని కొద్ది మంది అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీని ఆశించన మేర చూపించలేదనే ఓపీనియన్స్ కూడా వెల్లడయ్యాయి.

వీరమల్లు, ఔరంగజేబ్ యుద్ధ సన్నివేశాలను పార్ట్ 2కి షిఫ్ట్ చేశారు. దీంతో మొదటి భాగం కంటే 2వ భాగం తప్పకుండా మెప్పిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ OG చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లోని ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X