‘పవన్ కళ్యాణ్ డబ్బుకు లొంగరు.. షారుఖ్ రేంజ్ రెమ్యునరేషన్‌‌ని వెంట్రుకలా’

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానుల దగ్గరి నుంచి సినీ ప్రముఖుల వరకు ఎన్నోసార్లు ఆయన మంచితనం, మానవత్వం గురించి వేదికల మీదే పంచుకున్నారు. తన వద్దకు సాయం కోరుతూ వచ్చిన వారిని ఖాళీ చేతులతో ఏనాడూ పంపలేదు. పవన్ కళ్యాణ్ డబ్బుకు ఏమాత్రం విలువ ఇవ్వరని ఎన్నోసార్లు రుజువైంది. అగ్రనటుడిగా 100 కోట్ల పారితోషికం సంపాదిస్తున్నప్పటికీ.. ప్రజల కోసం తన కెరీర్, స్టార్‌డమ్‌ను వదిలిపెట్టి ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగారు పవన్.

Also Read
'మెగా ఫ్యామిలీతో ఆ అదృష్టం నాకే... పవన్ కళ్యాణ్‌ క్రేజ్ అప్పుడే చూశా'
'మెగా ఫ్యామిలీతో ఆ అదృష్టం నాకే... పవన్ కళ్యాణ్‌ క్రేజ్ అప్పుడే చూశా'

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన స్టైల్, మేనరిజం, నటన, ఫైట్స్‌తో తిరుగులేని స్థాయికి చేరుకున్నారు పవన్. తొలినాళ్లలో ఫ్యామిలీ, లవ్ సినిమాలు చేసినా తర్వాత తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు పవర్‌స్టార్. బద్రీ, తమ్ముడు, ఖుషీ సినిమాలతో టాలీవుడ్‌లో తిరుగులేని స్థాయికి చేరుకోవడంతో పాటు యూత్ ఐకాన్‌గా మారారు పవన్ కళ్యాణ్. కొన్నేళ్ల పాటు వరుసగా పరాజయాలు ఎదురైనా.. ఆయన క్రేజ్ పెరిగిందే తప్పించి తగ్గలేదు. రికార్డ్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాశారు.

Pawan Kalyan Rejected Crores in Ads Harish Shankar Reveals Power Star s Personality

మూడు దశాబ్ధాల సినీ కెరీర్‌ను ప్రజల కోసం వదులుకుని జనసేన పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు పవన్ కళ్యాణ్. పదేళ్ల పాటు ఎన్నో అవమానాలను భరించి పట్టుదలతో, తనదైన వ్యూహాలతో జనసేన పార్టీని అధికారంలోకి భాగం చేశారు. ప్రజా నాయకుడిగా ప్రజల కష్టాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు జనసేనాని. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తాను గతంలో కమిటైన సినిమాలను కష్టపడి పూర్తి చేసి నిర్మాతలపై భారాన్ని తగ్గించారు.

Recommended For You
డాక్టర్‌ బాబుపై మనసుపడ్డ ఆ అమ్మాయి.. అలా మిస్ అయ్యానంటూ..
డాక్టర్‌ బాబుపై మనసుపడ్డ ఆ అమ్మాయి.. అలా మిస్ అయ్యానంటూ..

ఇదిలాఉండగా.. స్టార్స్ అంటే సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ప్రమోషన్స్ ద్వారా కోట్లలో ఆర్జిస్తారని అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోల నుంచి నిన్న మొన్న వచ్చిన హీరోలు వరకు యాడ్స్‌లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తారు. కెరీర్ తొలినాళ్లలో ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు పవన్. సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ సమయంలో పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఏకైక హీరో పవన్ కావడం విశేషం. కేవలం ఒక్క నిమిషం యాడ్ కోసం కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకుని సంచలనం సృష్టించారు పవర్‌స్టార్. అయితే ఆ తర్వాత యాడ్స్, బ్రాండింగ్‌ను మానేశారు పవన్ కళ్యాణ్. బడా కంపెనీలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే తిరస్కరించారు పవన్. కొద్దిరోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు హరీశ్ శంకర్.

You May Also Like
ఆ రోజు ఏటీఎం దగ్గర ఏడ్చేశా... సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
ఆ రోజు ఏటీఎం దగ్గర ఏడ్చేశా... సాయిధరమ్ తేజ్ ఎమోషనల్

కళ్యాణ్ గారి జర్నీ సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ చాలా కష్టంగా సాగింది. డబ్బుకు ఏ మాత్రం కూడా లొంగని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్‌లో చాలామంది సినిమాలు చేయమని అడిగారు. కొంతమంది కార్పోరేట్ వాళ్లు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామన్నారు. కళ్యాణ్ గారికి 2012లోనే.. పాన్ ఇండియా అనే టర్మ్ లేదు. కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ తీసుకునే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. కానీ ఆయన మాత్రం.. కార్పోరేట్ ప్రొడక్ట్స్ ఆరోగ్యకరం కాదని, కొన్ని ప్రొడక్ట్స్ చిన్న పిల్లలకి మంచిది కాదని పవన్ రిజెక్ట్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు.. నా కళ్లముందు ఆయన కొన్ని కోట్ల రెమ్యునరేషన్‌ వచ్చే యాడ్స్‌ని రిజెక్ట్ చేశారు. యాడ్స్ చేసేవాళ్లని తప్పుబట్టడం లేదు కానీ.. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మాత్రమే తెలియజేస్తున్నా. ఎక్కడ తనకు నెగిటివిటీ ఉన్నా చొచ్చుకెళ్లే తత్వం అయనది, ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీ డే ముందుంటాడు. ఎవరెస్ట్ అంత ధనరాశిని వెంట్రుకలా తీసేస్తారని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

Read more about: pawan kalyan harish shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X