PKSDT ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. బడ్జెట్ ఎంతంటే?

పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పేసి వాటిని పట్టాలమీదికెక్కించాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు చేస్తూ దానిని పక్కన పెట్టి మరీ వినోదయ సీతమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సాయి తేజ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు పవన్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే ఎంత మొత్తంలో తీసుకుంటున్నాడన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాకు రోజుకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానని జనసేన పార్టీ పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు పీకే. సినిమా పేరు ప్రస్తావన లేకుండానే 22 రోజుల షూటింగ్ కి గానూ తనకు రోజుకు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పాడు.

Pawan Kalyan remuneration for PKSDT Project and remuneration details

ఈ స్థాయి మీరిచ్చిందే అంటూ ఫ్యాన్స్ ను ఆకాశానికెత్తాడు. అయితే పవన్ కళ్యాణ్ సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న వినోదయ సీతమ్ మూవీకి 20 రోజులకు పైగా డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా వినోదయ సీతమ్ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ రోజుకు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని క్లారిటీ వచ్చేసింది. 22 రోజులని పీకే చెప్పినా రెండు మూడు రోజు అటు ఇటుగా మారితే 50 కోట్లు అందుకున్నట్లే అవుతుంది.

తమిళ్ లో వచ్చిన వినోదయ సీతమ్ మూవీ చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇందులో సముద్రఖని పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ పోషించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాయి. దాదాపు 100 కోట్ల వరకు మార్కెట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో కలిపి ఈ సినిమాపై నిర్మాతలు 70 నుండి 80 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాకు సముద్రఖని డైరెక్టర్ అయినప్పటికీ కర్త, కర్మ, క్రియ అంతా త్రివిక్రమ్ శ్రీనివాసే అన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కటీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X