నా రెండు చెప్పులు పోయాయి.. ఆ వ్యక్తిని పట్టుకొండి.. నా చెప్పులు ఇప్పించండి.. పవన్ కల్యాణ్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన వారాహి విజయ యాత్ర మూడో రోజుకు చేరుకొన్నది. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం నుంచి ప్రారంభించిన యాత్ర శుక్రవారం (జూన్ 16వ) తేదీన పిఠాపురం చేరుకొన్నది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నా చెప్పులు ఎత్తుకెళ్లారు అని చెప్పడం ఆసక్తిని రేపింది. ఈ చెప్పుల కథ వివరాల్లోకి వెళితే..
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనను ప్యాకేజ్ స్టార్ అంటూ పదే పదే ఆరోపించడంపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. నన్ను ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడుతాను అంటూ ఘాటుగా స్పందించారు. అలా చెప్పు చూపించడంపై వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేశారు.

అయితే గోదావరి జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని ఘాటైన సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే.. తాను రెండు చెప్పులు చూపిస్తాను. రెండు చెప్పులతో కొడుతాను అంటూ పేర్ని నాని, కాకాని గోవర్ధన్ రెడ్డిపై తనదైన శైలిలో స్పందించారు. అలాగే ఇతర నేతల కూడా స్పందిస్తుండటంతో పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.
పిఠాపురం సభలో మాట్లాడుతూ.. నేను వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే.. వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. వారి పేర్లు గుర్తుపెట్టుకోవడం అవసరమా? ఏపీ వ్యవసాయ మంత్రి గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేను తెల్లబట్టలు వేసుకొని వచ్చే వాడిని. కానీ నేను ఈ రోజు షర్ట్, పాయింట్ వేసుకొని ఎందుకు వచ్చానో తెలుసా? మీకు సందేహం రాలేదా? అని జనాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు.
మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్తే చెప్పులు.. నా రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులేకపోతే జుబ్బా లేదా కుర్తా వేసుకొంటే బాగుండదు కదా అని.. ప్యాంట్, షర్ట్ వేసుకొని షూస్ వేసుకొన్నాను. నాకు ఇష్టమైన రెండు చెప్పులను ఎవరో దొంగిలించారు. ఆ వ్యక్తి ఎవరో తెలియడం లేదు. ఆ వ్యక్తి కనిపిస్తే పట్టుకొండి. నా రెండు చెప్పులు ఇప్పించండి అని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు.

వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే.. గుళ్లో వదిలిన నా రెండు చెప్పులను కూడా ఎత్తుకెళ్లిపోతున్నది. ఇది చాలా దారుణం అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. పరోక్షంగా ఇటీవల పవన్ కల్యాణ్‌కు రెండు చెప్పులు చూపించిన సంఘటనపై పవన్ కల్యాణ్ పైటర్లు విసరడంతో జనం నుంచి మంచి స్పందన లభించింది.


Click it and Unblock the Notifications











