పవన్ కల్యాణ్ టార్గెట్ ఫిక్స్.. లాక్‌డౌన్ తర్వాత బాదుడు మొదలు!

By Manoj

చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. తక్కువ వ్యవధిలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అంతేకాదు, లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే బాదుడు మొదలెడతాడట. వివరాల్లోకి వెళ్తే..

పవన్ డేరింగ్ స్టెప్.. ఫ్యాన్స్ వెయిటింగ్

పవన్ డేరింగ్ స్టెప్.. ఫ్యాన్స్ వెయిటింగ్

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కల్యాణ్.. అందుకోసం బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' మూవీని ఎంచుకున్నారు. ఇప్పటికే రెండు భాషల్లో వచ్చిన ఈ మూవీతోనే ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అమితాబ్, అజిత్ ఈ పాత్రను అద్భుతంగా చేయడంతో.. పవన్ ఎలా చేయబోతున్నాడన్న ఆసక్తి ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది.

లాయర్ సాబ్‌ను వకీల్ సాబ్‌గా మార్చారు

లాయర్ సాబ్‌ను వకీల్ సాబ్‌గా మార్చారు

వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్ కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు మొదట ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. దానికి ‘వకీల్ సాబ్' అని మార్చారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

వాటికి భారీ రెస్పాన్స్.. అంచనాలు రెట్టింపు

వాటికి భారీ రెస్పాన్స్.. అంచనాలు రెట్టింపు


కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఆ తర్వాత మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘మగువ మగువా' పాటకు కూడా ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయిపోయాయి. అంతేకాదు, పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాయి.

ఆ విషయంలో ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు

ఆ విషయంలో ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు

పవన్ రీఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో ఆయన ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, కరోనా ప్రభావంతో షూటింగులు నిలిచిపోవడంతో ‘వకీల్ సాబ్' వాయిదా తప్పేలా లేదు. వాస్తవానికి ఈ మూవీని మే 15న విడుదల చేయాలని భావించారు.

Recommended Video

Pawan Kalyan Didn't Use Even Caravan while Movie Shootings
లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే బాదుడు.!

లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే బాదుడు.!


లాక్‌డౌన్ ప్రభావంతో తన సినిమాలు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉండడంతో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... షూటింగులు ప్రారంభమైన నెల రోజుల్లోపే ‘వకీల్ సాబ్'ను విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అంతేకాదు, లాక్‌డౌన్ కంప్లీట్ అయిన వెంటనే ఫైట్‌తో చిత్రీకరణ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X