ఆ క్షణంలో చిరంజీవి పిస్టల్‌తో కాల్చుకొని.. సూసైడ్ చేసుకొవాలనుకొన్నా.. పవన్ కల్యాణ్

Recommended Video

Pawan Kalyan Speech | Megastar Chiranjeevi Birthday Celebrations |SyeRaa Narasimha Reddy| Ram Charan

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈవెంట్ గురువారం (ఆగస్టు 21) సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో మెగాస్టార్ చిరంజీవి ఎంత కీలకంగా వ్యవహరించాడనే విషయాన్ని గుర్తుతెచ్చుకొని భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో నిరాశ,నిస్పృహలకు లోనైన తాను ఓ దశలో సూసైట్ చేసుకోవాలనుకొన్నానని, అన్నయ్య చెప్పిన మాటలతో మనసు మార్చుకొన్నానని పవన్ చెప్పారు. ఆ ఘటన గురించి మరిన్నీ వివరాలు..

 ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు

ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు

నేను ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిల్ కావడం చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ సమయంలో అన్నయ్య లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకోవాలనుకొని ప్రాణాలు తీసుకోవాలనుకొన్నాను. ఆ పరిస్థితిలో అంత దారుణంగా మానసిక స్థితి ఉండేది. నా డిప్రెషన్ చూసి అన్నయ్య మంచి మాటలు చెప్పారు అని పవన్ గుర్తు చేసుకొన్నారు.

డిప్రెషన్‌లోకి వెళ్లొద్దని.. అన్నయ్య

డిప్రెషన్‌లోకి వెళ్లొద్దని.. అన్నయ్య

ఇంటర్మీడియెట్ ఫెయిల్ కావడం పెద్ద సమస్య కాదు. ఫెయిల్ అయితే మరోసారి పాస్ కావొచ్చు. దానికి డిప్రెషన్‌లోకి వెళ్లొద్దు. నాగబాబుతో ఏదో చెబుతూ ముందు నీవు బతకాలి. ఇలా కాకపోతే మరోలా చదువుకో. అలా అన్నయ్య చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చాయి అని పవన్ చెప్పారు.

కిందా మీద పడి ఇలా

కిందా మీద పడి ఇలా

అలా అన్నయ్య చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని కిందా మీద పడి ఇలా మీ ముందు ఏదో ఒక హోదాలో ఉన్నాను. నా జీవితాన్ని మలుపు తిప్పిన సందర్భాలకు కారణం చిరంజీవి గారే. ఇలాంటి అన్నయ్య ఉంటే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు తప్పిన 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదేమో అని పవన్ ఎమోషనల్ అయ్యారు.

సురేఖ వదినతో కూడా

సురేఖ వదినతో కూడా


చిరంజీవి చెప్పిన పలు సందర్బాల్లో చెప్పిన మాటలతోనే తాను తన లక్ష్యాన్ని మార్చుకొన్నాను. యాక్టింగ్ కెరీర్ తొలినాళ్లలో కెమెరా ముందు సిగ్గుపడిపోయే వాడిని. ఓ సారి సుస్వాగతం షూటింగ్ సమయంలో విశాఖపట్నంలో బస్‌పై భాగాన డ్యాన్స్ చేసే సీన్ షూటింగ్ సందర్భంగా సిగ్గుతో చేయలేకపోయాను. వందలాది మంది చూస్తుండగా చేయలేనని వదిన సురేఖ గారికి చెప్పి.. నేను యాక్టింగ్ సరికాదని, ఏమి చేయలేని స్థితిలో జీవితాన్ని ముగిస్తానని అని అన్నాననే విషయాన్ని గతంలో కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X