1000 కోట్ల ఆఫరా?.. చెప్పుతో కొడుతా..ఒక్క రోజు నా రెమ్యునరేషన్ ఎంతంటే? పవన్ కల్యాణ్ ఫైర్
ప్యాకేజ్ అని పిచ్చి వాగుడు వాగితే చెప్పుతో కొడుతానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆవేశపూరితంగా వార్నింగ్ ఇచ్చారు. మచిలిపట్నంలో జరిగిన జనసేన ఆవిర్బావ సభలో ఆవేశంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తాను నటిస్తున్న వినోదయ సీతమ్ సినిమా కోసం తాను తీసుకొంటున్న రికార్డు రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా వివరించారు. పవన్ కల్యాణ్ స్పీచ్ సాగిన విధానం ఎలా ఉందంటే?

1000 కోట్ల ఆఫరా?
తెలంగాణ ముఖ్యమంత్రి నాకు 1000 కోట్లు ఆఫర్ ఇచ్చారట. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కొంటున్నాను. పవన్ కల్యాణ్‌కు వెయ్యి కాకుండా 10 వేల కోట్లు ఆఫర్ చేసుంటే వినడానికి బాగుండేది. 1000 కోట్లతో మిమ్మల్ని కొనగలనా? డబ్బుతో మీ గుండెల్లో స్థానం సంపాదించుకోగలనా? భావంతో కదా మీతో ఏకం అవుతాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్యాకేజ్ అంటే మళ్లీ చెప్పుతో కొడుతా
డబ్బులు, వెయ్యి కోట్లు తీసుకొన్నారు. ప్యాకేజీ తీసుకొన్నారని అంటే చెప్పు చూపించాను. నా చెప్పు విదేశీ బ్రాండ్ కాదు.. తెనాలిలో మా వెంకటేశ్వర్ రావు చేసిన లోకల్ చెప్పు. ఇంకోసారి ప్యాకేజీ పేరెత్తితే.. పిచ్చి వాగుడు వాగితే.. గట్టి దెబ్బ తగులుతుంది. డబ్బుకు నేను ఆశపడే వ్యక్తిని కాను. డబ్బు సంపాదించి పేదలకు పంచి పెట్టేవాడినే తప్ప.. డబ్బుకు ఆశపడే వాడిని కాదు అని పవన్ కల్యాణ్ అన్నారు.

వినోదయ సీతమ్ రీమేక్ కోసం
నేను ధైర్యంగా ఓ మాట చెబుతున్నాను. నేను ఇప్పుడు ఓ సినిమా (వినోదయ సీతమ్ రీమేక్) చేస్తున్నాను. ఆ సినిమా కోసం 22 పనిచేస్తున్నాను. ఒక్కో రోజుకు నేను 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటాను. 20 లేదా 25 రోజులు పనిచేస్తే 45 కోట్ల వరకు వస్తుంది. ప్రతీ సినిమాకు అంత ఇస్తారని చెప్పలేను. కానీ అది నా యావరేజ్ స్థాయి. నాకు మీరు ఇచ్చిన స్థాయి. మీరు గుండెల్లో పెట్టుకొనే స్థాయి. డబ్బుల అవసరం నాకు ఉందా? నేను సంపాదించలేని డబ్బా? నేను చూడని సుఖాలా? అని పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు.

ఆకలి విలువ తెలిసిన వాడిని
ఆకలి విలువ తెలిసిన వాడిని. ఒంటిపూట భోజనం చేసి ఆకలితో అలమటించిన వాడిని. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును. కష్టాలు తెలిసిన వాడిని. ఇంత సంపాదించే కెపాసిటీ ఉండి.. ఎందుకు రాజకీయాల్లో ఉన్నానంటే.. 1964 నుంచి అందరూ పాలన మారాలని చెబుతున్నారు. ఒకే కులానికి రాజ్యాధికారం ఉండవద్దని చెబుతున్నారు. అన్ని కులాలకు సమాన ప్రాతినిథ్యం ఉండాలని అంటారు. దూకు దూకు అంటారు.. దూకే వారు లేరు. కానీ నేను ధైర్యంతో దూకేశాను. కానీ మీరు నన్ను ఓడించారు. అయినా బాధపడలేదు. మీ గుండెల్లో స్థానం సంపాదించుకొంటాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

నాకు అధికారం అప్పగిస్తే..
యువతను కోరేది ఒకటే.. మీరు కళల ఖనిజాలతో చేసిన సంపద మీరు. మీరు మీ కులాల నాయకులను నిలదీయండి. పదవుల్లో కొనసాగుతున్న కులనాయకులను మీ కోసం ఏం చేశారని అడగండి. నాకు అధికారం అప్పగిస్తే.. మీ కులాల నాయకులను మెడలు వంచి పనిచేయిస్తాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











