పవన్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు: ముందుగా ఆ సినిమానే పూర్తి చేస్తాడట
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. అది పట్టాలపై ఉన్న సమయంలోనే మరో రెండు చిత్రాలను మొదలు పెట్టేశాడు. అందులో మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఈ సినిమాను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందిస్తున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్‌తో పాటు దగ్గుబాటి వారి అబ్బాయి దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు.
'అయ్యప్పనుమ్ కోషియం' మూవీ రీమేక్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, ఇప్పుడు కరోనా రెండో దశ కారణంగా దీనికి బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎప్పుడు పున: ప్రారంభించబోతున్నారు అన్న దానిపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నుంచి మొదలు పెడతారట. అప్పటి నుంచే పవన్ కల్యాణ్ ఈ చిత్రీకరణలో పాల్గొంటాడని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పుడు చేయాల్సి ఉన్న చిత్రాల్లో దీన్నే ముందుగా కంప్లీట్ చేయాలని అతడు నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











