Bheemla Nayak పవర్‌స్టార్ వస్తున్నాడు జాగ్రత్త.. థియేటర్లకు ఇన్సూరెన్స్ ఉందా? డిజే టిల్లు సిద్దు ట్వీట్ వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా భీమ్లా నాయక్ మూవీపై క్రేజ్ భారీగా పెరుగుతున్నది. అనేక ఊహాగానాలు, ఊగిసలాట మధ్య పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే ... సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారి తీస్తున్నాయి. అయితే సినిమా ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ట్వీట్లు చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ గురించి ఎలాంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నదంటే..

 ఉత్తరాదిలో కూడా భారీ క్రేజ్

ఉత్తరాదిలో కూడా భారీ క్రేజ్

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం తొలిసారిగా ఉత్తరాది మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నది. ఇంతకుముందు పవన్ నటించిన చిత్రాలు డబ్బింగ్ అయ్యాయి. కానీ అవి రిలీజ్ తర్వాత ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మొట్టమొదటిసారి భీమ్లా నాయక్ డబ్బింగ్ మూవీ ద్వారా హిందీ మార్కెట్‌లోకి పవర్ స్టార్ అడుగుపెట్టడం మరింత ఆసక్తిగా మారింది.

రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజ్

రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజ్

అలాగే ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో భీమ్లా నాయక్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోను, ఇతర ప్రాంతాల్లోను లెక్కకు మించిన థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్లు, స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. త్వరలోనే భీమ్లా నాయక్ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారనే విషయం స్పష్టమవుతుంది.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ భారీ రెస్సాన్స్

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌ భారీ రెస్సాన్స్

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానుల నుంచి భారీగా స్పందన వ్యక్తమవుతున్నది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడంతోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్టు సోషల్ మీడియా రిపోర్టు. యూఎస్‌లో పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు సమాచారం.

క్రేజ్‌ను ఎవరూ బీట్ చేయలేరు


ఇక పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ పోస్టర్ గురించి ట్వీట్ చేస్తూ.. పవర్ స్టార్‌ది భయం లేని వ్యక్తిత్వం, ఆయన క్రేజ్‌ను ఎవరూ బీట్ చేయలేరు. స్టైల్‌కు ఎవరికి సాధ్యపడనిది. వ్యక్తిత్వం మాటల్లో చెప్పలేనిది అనే విధంగా ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ పోస్టర్‌కు పైన చెప్పిన నాలుగు పదాలు చక్కగా సరిపోతాయి. బాక్సాఫీస్ వద్ద జరగబోయే యుద్దానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు పోస్టర్ చెబుతున్నది. పీఎస్‌పీకే, పవర్ స్టార్ గేమ్ మొదలైంది.. అభిమానుల గెట్ రెడీ అంటూ శశిధర్ అడివి ట్వీట్ చేశారు.

Recommended Video

RRR, Bheemla Nayak Release Dates బాక్సాఫీస్ వార్ | Radhe Shyam | KGF 2 | Filmibeat Telugu

థియేటర్లలో భీమ్లా నాయక్ విజృంభణ

భీమ్లా నాయక్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని యువ హీరో సిద్దూ జొన్నలగడ్డ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సార్ ప్రపంచ తెలుగు సినిమాను గుప్పిట్లోకి తీసుకోబోతున్నారు. పవర్ స్టార్, రానా దగ్గుబాటి ఇద్దరు స్క్రీన్లపై తమ నటనతో విజృంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లన్నీ మంచిగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటారని అనుకొంటున్నాను. నిర్మాత నాగవంశీకి 25వ తేదీ తర్వాత కలెక్షన్లను లెక్కించడమే పని. దర్శకులు తివిక్రమ్, సాగర్ చంద్రకు ముందస్తు అభినందనలు అంటూ సిద్దూ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X