Bheemla Nayak ప్రపంచవ్యాప్తంగా పవన్ కల్యాణ్ ఫీవర్.. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదల తేదీ ప్రకటించగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానుల్లో జోష్ పెరిగింది. ఫిబ్రవరి 25వ తేదీన పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన అభిమాన నటుడి సినిమా వస్తుందనే వార్తతో సినీ ప్రముఖులు కూడా ఫ్యాన్స్‌గా మారి ట్వీట్లు చేస్తున్నారు. డీజే టిల్లుతో హిట్ కొట్టిన సిద్దూ జొన్నలగడ్డ, మరో నటుడు అడివి శేషు తదితరులు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ట్రైలర్ నిడివి, డేట్ ఇలా..
ఇక భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ పడగానే.. ఈ సినిమా గురించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ముఖ్యంగా భీమ్లా నాయక్ ట్రైలర్ గురించిన ఆసక్తికరమైన విషయం మీడియాలో వైరల్ అయింది. ఫిబ్రవరి 19వ తేదీన రిలీజ్ అవుతున్న ట్రైలర్ నిడివి 2 నిమిషాల 25 సెకన్లు అని చెప్పారు. ఈ ట్రైలర్ అభిమానులు గతంలో ఎన్నడూ చూడని విధంగా పవర్ ప్యాక్డ్‌గా ఉంటుంది అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ డబ్బింగ్ పూర్తి
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్‌కు సమయం తక్కువగా ఉండటంతో చిత్ర యూనిట్ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తయింది. పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 15న తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్‌పై నిర్మాత, దర్శకులు దృష్టిపెట్టారు అని తెలిసింది.

యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు నిర్మాత నాగవంశీ ప్రయత్నిస్తున్నారు. ఈ వేడుకను వైభవంగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ జోరు
భీమ్లా నాయక్ ఫీవర్ ఓవర్సీస్ మార్కెట్‌ను తాకింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అమెరికాలోని సినీ లాంజ్ థియేటర్ ఏకంగా తొలి రోజు 13 షోలు ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన తొలి థియేటర్‌గా సినీ లాంజ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ థియేటర్‌లో టికెట్ ధర 20 డాలర్లు, 15 డాలర్లుగా నిర్ణయించారు.
Recommended Video

భీమ్లా నాయక్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
మలయాళంలో విజయవంతమైన అయ్యప్పునమ్ కోషియం సినిమా ఆధారంగా భీమ్లా నాయక్ తెరకెక్కింది. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక వివరాల వివరాలు ఇలా ఉన్నాయి.
నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, బ్రహ్మనందం, మురళీ శర్మ, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ
సినిమాటోగ్రఫి: రవి కే చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: తమన్ ఎస్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2022-02-22


Click it and Unblock the Notifications











