twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పింక్ కలర్ మార్చేసిన పవన్ కల్యాణ్‌.. వకీల్ సాబ్‌పై చెలరేగుతున్న విమర్శలు

    |

    బాలీవుడ్‌లో విజయవంతమైన పింక్ ఆధారంగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రీలీజ్ చేయగా రికార్డు వ్యూస్‌ను సాధించింది. అయితే అంతే మొత్తంలో పవన్ కల్యాణ్‌తో కూడిన పోస్టర్‌పై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంతకీ ఆ విమర్శలకు కారణమేమింటంటే..

    హిందీ, తమిళం తర్వాత తెలుగులోకి

    హిందీ, తమిళం తర్వాత తెలుగులోకి

    హిందీలో తెరకెక్కిన పింక్ చిత్రం ప్రధానంగా మహిళా సమస్యతో సాగుతుంది. ఈ చిత్రానికి చెందిన రీమేక్ రైట్స్‌ను బోనికపూర్ సొంతం చేసుకొని తమిళంలో నేర్కొండ పార్వాయిగా సూపర్‌స్టార్ అజిత్‌తో నిర్మించగా ఘనవిజయాన్ని అందుకొన్నది. తమిళంలో అందించిన విజయోత్సహంతో తెలుగులో పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్‌గా రూపొందించారు.

     భావోద్వేగమైన మహిళా సమస్యతో

    భావోద్వేగమైన మహిళా సమస్యతో

    హిందీలోగానీ, తమిళంలో గానీ పింక్ సినిమా కథ భావోద్వేగమైన మహిళా సమస్యతో రూపొందింది. అయితే తెలుగులోకి వచ్చే సరికి పింక్‌ కథను ఫ్లేవర్‌ను కలర్‌ను పూర్తిగా మార్చి వేసినట్టు కనిపిస్తున్నది. వకీల్ సాబ్ టైటిల్ చూస్తే పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిందనే విమర్శ వినిపిస్తున్నది. ఇక ఈ సినిమాలో మహిళా ఫ్లేవర్ ఏదీ అనే మాట బలంగా వినిపిస్తున్నది.

    Recommended Video

    Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
    నిర్భయ లాంటి గ్యాంగ్ రేప్ కథతో

    నిర్భయ లాంటి గ్యాంగ్ రేప్ కథతో

    దారుణంగా గ్యాంగ్ రేప్‌కు గురైన ఓ మహిళ ఆవేదన పాయింట్‌తో పింక్ చిత్రం రూపొందింది. అలాగే ప్రస్తుతం నిర్భయ లాంటి గ్యాంగ్‌రేప్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. గత ఏడేళ్లుగా నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పింక్ లాంటి చిత్రాన్ని రూపొందిస్తుంటే కమర్షియల్ విలువల కోసం ఈ సినిమాను మహిళల సినిమా అనే బ్రాండ్‌ను తప్పించి పవన్ కల్యాణ్ మూవీగా మార్చేయడంపై నిరసనలు వినిపిస్తున్నాయి.

    వివాదంలో వకీల్ సాబ్ పోస్టర్

    వివాదంలో వకీల్ సాబ్ పోస్టర్

    వకీల్ సాబ్ మూవీ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో.. అప్పటి నుంచి ఈ సినిమా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. వర్మ లాంటి దర్శకులతోపాటు పలువురు ఈ పోస్టర్‌పై విమర్శలు ఎక్కు పెట్టారు. రిలాక్స్ మూడ్‌లో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని పవన్ కల్యాణ్ పుస్తకం చదవడం ఏమిటీ? ఈ సినిమా పోస్టర్‌పై కనీసం మహిళా సమస్యలు ప్రతిబింబించేలా ఆనవాళ్లు లేవేమిటి అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. తమిళంలో అజిత్, హిందీలో అమితాబ్ బచ్చన్ పోస్టర్‌పై మహిళతో ఉండేలా జాగ్రత్తపడ్డారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

     తెలుగు నేటివిటీకి అనుగుణంగా

    తెలుగు నేటివిటీకి అనుగుణంగా

    పింక్ చిత్రాన్ని తెలుగు నేటివిటికి అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేసి వకీల్ సాబ్‌గా తెరకెక్కిస్తున్నాం. అయితే కథను తప్పు దారి పట్టించడం లేదు. కథలో సారాన్ని సరైన ట్రీట్‌మెంట్‌తో ముందుకు తీసుకెళ్తున్నాం. పింక్ మూవీ కథను వక్రీకరించకుండా, పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు భంగం కలుగకుండా సమతుల్యం పాటిస్తున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.

    English summary
    Power star Pawan Kalyan's Vakeel Saab movie poster goes contraversial. Pawan is making re entry with this in tollywood after 2 years. This movie poster landend in contraversy, which is released recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X