twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీలో వకీల్‌ సాబ్.. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన అమెజాన్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తారీఖున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. మొదటి ఆట నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త వెనుకబడింది అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా టికెట్ రేట్లు తగ్గించడంతో కాస్త వివాదం నడిచింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాను ఆన్లైన్ లో విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    జాన్వీ కపూర్.. ఎలాంటి డ్రెస్ వేసినా కనువిందు పక్కా..

    ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అమెజాన్ ప్రైమ్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఈ విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ సినిమా అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ పేర్కొంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారందరూ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇక ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమ అభిమాన హీరో సినిమా చూసే అవకాశం దక్కిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

     Pawan Kalyans Vakeel Saab on Amazon prime video, OTT release date is..

    వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ జంటగా నటించింది. అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ వాదిస్తున్న కేసుకు వ్యతిరేకంగా వాదించే లాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించిన వారికి కూడా మంచి గుర్తింపు దక్కింది. బోనికపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్. స్త్రీల గురించి, స్త్రీల సమస్యల గురించి ప్రస్తావించిన ఈ సినిమాకు మహిళా లోకం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

    English summary
    Power star Pawan Kalyan's super hit courtroom drama, Vakeel Saab will have its digital premiere on April 30, 2021, on Amazon Prime Video. Recently Amazon Prime Video announced this officially.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X