పవన్ కల్యాణ్ పేరిట సరికొత్త రికార్డు: ఏకంగా 90 గంటల నుంచి హవాను చూపిస్తూ సత్తా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని సత్తా చాటాడతను. అంతేకాదు, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదగడంతో పాటు ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడీ మెగా హీరో. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన పవన్.. 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు ఓ ఘనతను అందుకున్నాడు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రమే 'వకీల్ సాబ్'. బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్'కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. బోనీ కపూర్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' టీజర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14న వదిలారు. అప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వ్యూస్, లైకుల పరంగా కొన్ని రికార్డులు కూడా బద్దలయ్యాయి.

Pawan Kalyans Vakeel Saab Teaser Trending in Youtube since 90 hours

పవన్ కల్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' టీజర్ నాలుగు రోజులుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఏకంగా 90 గంటలకు పైగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీజర్‌గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఇప్పటి వరకు 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను అందుకుంది. అంతేకాదు, ఎనిమిదిన్నర లక్షల పైచిలుకు లైకులు కూడా సాధించి సత్తా చాటుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X