Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Vakeel Saab Teaser: ఆరో స్థానంతో సరిపెట్టుకున్న పవన్.. అందులో మాత్రం రెండో ప్లేస్
రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే మూవీతో అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ వీడియో రిలీజ్ అవడంతో దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
ఇక, 'వకీల్ సాబ్' టీజర్ లెక్కలు చూస్తే... 24 గంట్లలో ఇది 8.57 మిలియన్ వ్యూస్ సాధించింది. తద్వారా టాలీవుడ్లో ఎక్కువ మంది వీక్షించిన టీజర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు 'సరిలేరు నీకెవ్వరు' 14.64 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలోనూ.. 'రామరాజు ఫర్ భీం' 14.14 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచాయి. అలాగే, 'సాహో' 12.94 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో, 'మహర్షి' 11.14 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో, 'భరత్ అనే నేను' 8.67 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉన్నాయి. వీటి తర్వాత పవన్ టీజర్ ఉంది.
లైకుల పరంగా చూసుకుంటే.. 24 గంటల్లో 'రామరాజు ఫర్ భీం' 94 లక్షల పైచిలుకు లైకులు సాధించి మొదటి స్థానంలో నిలవగా.. 77 లక్షలు పైచిలుకు లైకులతో 'వకీల్ సాబ్' టీజర్ రెండో స్థానానికి చేరుకుంది. వీటి తర్వాత 'భీమ్ ఫర్ రామరాజు', 'సాహో' తదితర చిత్రాల టీజర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, 'వకీల్ సాబ్'లో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.