పవన్ కల్యాణ్‌కే ఫస్ట్ ఛాయిస్.. వకీల్ సాబే కరెక్ట్..టాలీవుడ్ ఆశలన్నీ పవర్‌స్టార్ మీదే

తెలుగు చిత్ర పరిశ్రమ సుమారు మూడు నెలల తర్వాత షూటింగులకు సిద్ధమవుతున్నది. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా సినిమా షూటింగులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతరులకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనేలా చర్యలు తీసుకోవాలని నిబంధనలు రూపొందిస్తున్నది. అయితే ఎవరి సినిమా మొదలు ప్రారంభం కాబోతుందనే ఆసక్తి సినీ వర్గాల్లో పెరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

షూటింగులు ప్రారంభమైతే తొలి షూటింగ్

షూటింగులు ప్రారంభమైతే తొలి షూటింగ్

టాలీవుడ్‌లో షూటింగులు ప్రారంభమైతే అది పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ అనే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే వకీల్ సాబ్ చిత్రం దాదాపు పూర్తయింది. కొన్ని కోర్టు సిన్లు చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. అలాంటి సీన్లు చాలా సులభంగా ఎలాంటి ఆటంకం లేకుండా సినిమా షూట్ ముగించే అవకాశం కనిపిస్తున్నది.

తక్కువ మందితో కోర్టు సీన్లు

తక్కువ మందితో కోర్టు సీన్లు

వకీల్ సాబ్ షూటింగ్‌ ఎక్కువ భాగం ఇండోర్‌లో జరుగుతుంది కాబట్టి తక్కువ మంది సభ్యులతో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో వకీల్ సాబ్‌కు ముందు ఆహ్వానం పలుకుతారనే మాటకు బలం చేకూరుతున్నది. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్నదని, కేవలం పది రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఇటీవల దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే.

శృంగారపరమైన సీన్లు, ముద్దులు లేకపోవడం

శృంగారపరమైన సీన్లు, ముద్దులు లేకపోవడం

వకీల్ సాబ్‌ షూటింగ్‌కు అనుమతులు ఇవ్వడం వెనుక మరో కారణం కూడా ఉందనే మాటను సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో శృంగారపరమైన సీన్లు లేకపోవడం, మితి మీరిన ముద్దులు లేకపోవడం వల్ల సోషల్ డిస్టెన్స్‌ నిబంధనను అతిక్రమించడనికి ఆస్కారమే లేదు. ఇది పవన్ కల్యాణ్ సినిమాకు ఓ శుభ పరిణామంగా పేర్కొంటున్నారు.

థియేటర్లు ఓపెన్ అయితే పవన్ సినిమాతోనే

థియేటర్లు ఓపెన్ అయితే పవన్ సినిమాతోనే


ఇక సినిమా థియేటర్లు ఓపెన్ అయితే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా అనే బెంగ నిర్మాతలను వెంటాడుతున్నది. ఒకవేళ అత్యంత క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఆ అనుమానాలను కొంత మేరకు తగ్గించానికి అవకాశం ఏర్పడుతుందనే మాట వినిపిస్తున్నది. పవన్ కల్యాణ్ సినిమాను ముందుగా థియేటర్లకు తీసుకెళ్తే, కరోనా భయాలపై ప్రేక్షకుల్లో ఎదైనా అనుమానాలు ఉంటే తొలగిపోవడం ఖాయమనే చెబుతున్నారు.

Recommended Video

Sri Reddy Post On Poonam Kaur Over PK Mask
ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే వకీల్ సాబే కరెక్ట్

ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే వకీల్ సాబే కరెక్ట్

ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మొదటగా రిలీజ్ చేయడం సరైన పని. థియేటర్లు ఓపెన్ చేయాలంటే పవన్ కల్యాణ్ రేంజ్ ఉన్న సినిమాలే ముఖ్యం. ఇప్పటికిప్పుడు బడా హీరో సినిమా రిలీజ్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల వకీల్ సాబ్ సినిమాను ముందు పూర్తి చేసి థియేటర్లలోకి పంపడం ఉత్తమ నిర్ణయమని ఓ నిర్మాత మీడియాతో అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X